తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Latest Ooty Tour Package From Hyderabad Check Full Details

IRCTC Ooty Tour : సమ్మర్ లో ఊటీ ట్రిప్.. తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజ్

HT Telugu Desk HT Telugu

09 April 2023, 10:12 IST

    • IRCTC Hyd - Ooty Tour Package : సమ్మర్ లో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. వెళ్లే తేదీలతో పాటు ధరల వివరాలను పేర్కొంది.
హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ (www.irctctourism.com)

హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ

IRCTC Tourism Ooty Package: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్

ACB Arrested Sub Registrar : భూమి రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల లంచం, ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

TS Cop Carries Devotee : నల్లమల కొండల్లో 4 కి.మీ భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఊటీతో పాటుగా కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 18వ తేదీన అందుబాటులో ఉంది.

Day 01 : ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి.

Day 02 : రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.

Day 03 : మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.

Day 04 : నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.

Day 05 : ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.

Day 06 : ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్ల వివరాలు:

ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,220గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,330, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,410గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తిగా ధరల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు…..

హైదరాబాద్ - ఊటీ ధరల జాబితా

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.