Shirdi Tour From Tirupati : ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. ఇందులో సేద తీరే ప్రాంతాలతో పాటు ప్రముఖ అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉంటున్నాయి. తాజాగా తిరుపతి నుంచి షిర్డీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. “SAI SANNIDHI EX TIRUPATI” పేరుతో ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ.
Day 01 : తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 08.30 నిమిషాలకు జర్నీ(train no. 17417) స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది
Day 02 : ఉదయం 07.55 నిమిషాలకు నాగర్ సోల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... షిర్డీ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అనంతరం షిర్డీకి వస్తారు. హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నాగర్ సోల్ కు చేరుకుని.. రాత్రి 09.30 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10.10 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
Day 03 : మూడో రోజు రాత్రి 10.10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ అక్యూపెన్సీనికి 12,040 ఉండగా.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7240 చెల్లించాలి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో అయితే సింగిల్ అక్యుపెన్సీకి రూ. 9210 ఉండగా.. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 4410గా ఉంది. 5- 11 ఏళ్ల మధ్య ఉండే చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం