IRCTC Manali Tour: వేసవిలో 'మనాలీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ IRCTC ప్యాకేజీ చూడండి.. -irctc tourism announced manali tour from hyderabad city ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Irctc Tourism Announced Manali Tour From Hyderabad City

IRCTC Manali Tour: వేసవిలో 'మనాలీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ IRCTC ప్యాకేజీ చూడండి..

హైదరాబాద్ - మనాలీ టూర్
హైదరాబాద్ - మనాలీ టూర్ (www.irctctourism.com)

IRCTC Himachal Tour Package From Hyderabad: హిమాచల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీకోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. డేట్స్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది.

IRCTC Tourism Himachal Tour Package:సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. HAPPY HIMACHAL పేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో భాగంగా ఛండీఘర్, మనాలి. సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు మరిన్ని కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇది 7 రోజులు, 6 రాత్రుల ప్యాకేజీ. ప్రస్తుతం ఈ ట్రిప్ ఏప్రిల్ 18వ తేదీన అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రిప్ షెడ్యూల్ చూస్తే.....

Day 1: Hyderabad to Chandigarh

హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఛండీఘర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి సిమ్లాకు వెళ్లారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్ర మల్లా రోడ్ ను సందర్శిస్తారు. రాత్రి సిమ్లానే బస చేస్తారు.

Day 2: Shimla

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అక్కడ్నుంచి కుర్పీకి వెళ్తారు. సాయంత్రం స్ఖానికంగా ఉండే పలు ప్రాంతాలను చూస్తారు. రాత్రి సిమ్లాలోనే ఉంటారు.

Day 3: Shimla to Manali

టిఫిన్ తర్వాత... మానాలికి వెళ్తారు. సాయంత్రం వరకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 4: Manali

బ్రేక్ ఫాస్ట్ తర్వాత... మానాలి అందాలను వీక్షిస్తారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటారు.

Day 5: Manali

ఐదో రోజు కూడా మరిన్ని ప్రాంతాలకు వెళ్తారు. డిన్నర్ తర్వాత రాత్రి మానాలిలోనే బస చేస్తారు.

Day 6: Manali to Chandigarh

ఉదయం టిఫిన్ తర్వాత... ఛండీఘర్ ఎయిర్ పోర్టుకు ప్రయాణం అవుతారు. సాయంత్రం వరకు అక్కడికి చేరుకుంటారు. రాత్రి ఇక్కడే ఉంటారు.

Day 7: Chandigarh to Hyderabad

ఉదయం టిఫిన్ తర్వాత రాక్ గార్డెన్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఛండీఘడ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు....

టూర్ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 58550 గా ఉంటుంది. ఇక డబుల్ ఆక్యుపెన్సికీ 44200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 42300గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

హైదరాబాద్ - మనాలీ ట్రిప్ ధరల వివరాలు
హైదరాబాద్ - మనాలీ ట్రిప్ ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం