IRCTC Ladakh Tour: 7 రోజుల ట్రిప్ లో ఎన్నో అందాలు… లద్దాఖ్ టూర్ తాజా ప్యాకేజీ ఇదే -irctc tourism announced leh and ladakh tour from hyderabad city ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Irctc Tourism Announced Leh And Ladakh Tour From Hyderabad City

IRCTC Ladakh Tour: 7 రోజుల ట్రిప్ లో ఎన్నో అందాలు… లద్దాఖ్ టూర్ తాజా ప్యాకేజీ ఇదే

హైదరాబాద్ - లడ్డాఖ్ టూర్
హైదరాబాద్ - లడ్డాఖ్ టూర్

IRCTC Tourism Latest Plans: లద్ధాఖ్ చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఫ్లైట్‌ జర్నీ ద్వారా ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన డేట్స్, ధరలతో పాటు పూర్తి వివరాలను వెల్లడించింది.

Hyderabad - Ladakh Tour: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి లద్దాఖ్ కు కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది. చల్లని హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి అయిన లద్దాఖ్ అందాలను ఈ ప్యాకేజీ ద్వారా చూడొచ్చు. "LEH WITH TURTUK EX HYDERABAD" పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చూస్తున్నారు. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ మే నాల్గొ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో భాగంగా లేహ్, లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

షెడ్యూల్ ఇలా.....

Day 1- మొదటి రోజు ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌లో(శంషాబాద్ ఎయిర్ పోర్టు) ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటకు లేహ్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. రాత్రికి లేహ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.

Day -2 - ఇక 2వ రోజు ఉధయం లేహ్ నుంచి షామ్ వ్యాలీకి బయల్దేరుతారు. శ్రీనగర్ హైవేలో సైట్ సీయింగ్ ఉంటుంది. హాల్ ఆఫ్ ఫేమ్, కాలీ మందిర్, గురుద్వార, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్ వీక్షిస్తారు. రాత్రి కూడా లేహ్ లోనే బస చేస్తారు.

Day -3 - మూడో రోజు లేహ్ నుంచి నుబ్రా బయల్దేరాలి. దారిలో ఖార్‌దుంగ్లా పాస్ సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత దిక్షిత్, హండర్ విలేజెస్ చూస్తారు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి.

Day -4 నాలుగో రోజు టుర్టుక్ బయల్దేరాలి. ఇక్కడ ఉన్న టుర్టుక్ వ్యాలీని వీక్షించవచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి.

Day -5-ఐదో రోజు నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ బయల్దేరాలి. పాంగాంగ్ లేక్ సందర్శించవచ్చు. రాత్రి పాంగాంగ్ లోనే బస చేస్తారు.

Day -6- ఇక ఆరో రోజు ఉదయం పాంగాంగ్ సరస్సు దగ్గర సూర్యోదయాన్ని వీక్షించవచ్చు. ఆ తర్వాత లేహ్ బయల్దేరాలి. దారిలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్ చూస్తారు. లేహ్‌కు చేరుకున్న తర్వాత షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. రాత్రికి లేహ్‌లో బస చేయాలి.

Day -7- ఏడో రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్‌లో బయల్దేరితే రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ల రేట్లు....

లేహ్ లద్దాఖ్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.47,830, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.48,560, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.54,500చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు కంఫర్ట్ క్లాస్ లో ఉంటాయి. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నపిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, లేహ్‌లో సంప్రదాయ స్వాగతం, ఒక కల్చరల్ షో, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

టికెట్ల రేట్లు
టికెట్ల రేట్లు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మీ టూర్ ప్యాకేజీ వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం