IRCTC Tirupati Tour: వైజాగ్ నుంచి తిరుమల ట్రిప్ - ఐఆర్‌సీటీసీ తాజా ప్యాకేజీ ఇదే-irctc tourism announced tirumala tour from vizag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Tirumala Tour From Vizag

IRCTC Tirupati Tour: వైజాగ్ నుంచి తిరుమల ట్రిప్ - ఐఆర్‌సీటీసీ తాజా ప్యాకేజీ ఇదే

విశాఖ - తిరుమల టూర్
విశాఖ - తిరుమల టూర్

IRCTC Tirupati Tour Package : శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Tirupati Tour From Vizag: ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. స్వామి వారిని చూసి.. తరించిపోతుంటారు. వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం నుంచి టూర్ ప్రారంభమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీ.. ప్రస్తుతం జనవరి 27వ తేదీన అందుబాటులో ఉంది. 3 రాత్రులు, 4 రోజుల ట్రిప్ ఇది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు.

Day 01: విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 02: ఉదయం 04.5 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హెటల్ కి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత కాణిపాకం, శ్రీపురం వెళ్తారు. సొంత ఖర్చులతో భోజనం చేయాల్సి ఉంటుంది. తిరిగి హోటల్ కి చేరుకున్న తర్వాత రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 03: ఉదయం 6 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత ఉదయం 7 గంటలకు తిరుమల కొండకు చేరుకుంటారు. శ్రీవారి స్పెషల్ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత... తిరుచానూరు, శ్రీకాళహస్తికి వెళ్తారు. రాత్రి 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతారు.

Day 04: ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరలు:

IRCTC Tour Prices : సింగిల్ షేరింగ్ కు రూ. 23,155 ధర ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 14,245 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.12,00 గా ప్రకటించారు 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ వెళ్లొచ్చు.

వైజాగ్ - తిరుపతి టూర్ రేట్లు
వైజాగ్ - తిరుపతి టూర్ రేట్లు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

WhatsApp channel