IRCTC Kerala Tour: వేసవిలో కేరళ ట్రిప్.... రూ. 12 వేల ధరలో సరికొత్త ప్యాకేజీ
IRCTC Kerala Tour Package From Hyderabad: కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీకోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. డేట్స్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది.
IRCTC Tourism Kerala Tour Package:సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా కేరళ ట్రిప్ ప్లాన్ చేసే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 14వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు.ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. టూర్ షెడ్యూల్ చూస్తే కింది విధంగా ఉంటుంది....
Day 01: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
Day 02: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.
Day 03 : ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్ కు వెళ్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.
Day 04 : హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
Day 05 : హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
Day 06 : మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ రేట్ల వివరాలు:
ఈ కేరళ టూర్ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 31970 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18460 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14980 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నెలలో ఈ ట్రిప్ ధరలు పెరగనున్నాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
సంబంధిత కథనం