Summer Special Trains : వేసవి టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఇవిగో ప్రత్యేక రైళ్లు-south central railway extends special trains for summe season ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  South Central Railway Extends Special Trains For Summe Season

Summer Special Trains : వేసవి టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఇవిగో ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (HT)

Summer Special Trains : వేసవికి సొంతూళ్లు.. వివిధ ప్రాంతాలకు టూర్ లకు వెళ్లే వారి కోసం.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మార్చి నుంచి జూన్ వరకు ఎంపిక చేసిన తేదీల్లో స్పెషల్ ట్రైన్లు నడుస్తాయని పేర్కొంది.

Summer Special Trains : వేసవి సెలవుల్లో కొంత మంది సొంతూళ్లకు వెళితే... మరికొంత మంది ఇతర ప్రాంతాలకు టూర్ లు ప్లాన్ చేస్తారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటారు. సమ్మర్ లో పిల్లలకు సెలవులు కావటంతో... కుటుంబం అంతా కలిసి సరదాగా గడిపేందుకు నచ్చిన ప్లేస్ కు వెళుతుంటారు. వేసవి విడిది లొకేషన్స్ కు వెళ్లేందుకు ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తుంటారు. ఇలా వెళ్లే వారిలో ఎక్కువ మంది సేఫ్ జర్నీ కోసం చూస్తారు. ముఖ్యంగా... దూర ప్రాంతాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే... దక్షిణ మధ్య రైల్వే... ఏటా వేసవిలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తుంటుంది. ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా... రైళ్లను నడుపుతుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ప్రతి సంవత్సరంలాగే.. ఈ ఏడాది కూడా సమ్మర్ హాలిడేస్ కి స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు వేసవి ప్రత్యేక రైళ్లను పెంచుతూ వస్తోన్న అధికారులు.... తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. 22 రూట్లలో స్పెషల్ సర్వీసులు నడపుతున్నామని ప్రకటించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి....

తిరుపతి- అకోలా (07605), అకోలా- తిరుపతి (07606)..... పూర్ణ- తిరుపతి (07607), తిరుపతి-పూర్ణ (07608)...... హైద్రాబాద్‌- నర్సాపూర్‌(07631), నర్సాపూర్‌- హైద్రాబాద్‌(07632)..... హైద్రాబాద్‌- తిరుపతి (07643), తిరుపతి-హైద్రాబాద్‌ (07644).... విజయవాడ- నాగర్‌ సోయిల్‌ (07698), నాగర్‌ సోయిల్‌- విజయవాడ(07699)..... ట్రైన్లను పొడిగించారు.

కాకినాడ- లింగంపల్లి (07445), లింగం పల్లి- కాకినాడ (07446).... మచిలీపట్నం- సికింద్రాబాద్‌ (07185), సికింద్రాబాద్‌- మచిలీపట్నం (07186).... తిరుపతి- సికింద్రాబాద్‌ (07481), సికింద్రాబాద్‌- తిరుపతి (07482).... మచిలీపట్నం- తిరుపతి (07095), తిరుపతి- మచిలీపట్నం (07096) రైళ్లను కూడా జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తిరుపతి - జాల్నా (07413)... జాల్నా - తిరుపతి (07414)..... జాల్నా - ఛాప్రా (07651), ఛాప్రా - జాల్నా (07652) ట్రైన్లను పొడిగించింది. మార్చి - జూన్ వరకు.. ఎంపిక చేసిన తేదీల్లో ఈ రైళ్లు ఆయా రూట్లలో నడవనున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి... ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

2023, జనవరిలో రైల్వే రక్షణ దళం( RPF) సాధించిన విజయాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషన్ “రైల్ సురక్ష” ద్వారా 60 మంది నేరస్తులను అరెస్ట్ చేశామని... చోరీకి గురైన రూ. 39 .8 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఈ ఘటనలకు సంబంధించి 50 కేసులు నమోదయ్యాయని వివరించింది. ఆపరేషన్ “అమానత్” ద్వారా 208 మంది ప్రయాణికులకు సంబందించిన సుమారు రూ. 49. 3 లక్షల పై బడి విలువగల సామానును తిరిగి అప్పగించామంది. ఆపరేషన్ "నార్కోస్" ద్వారా రూ. 32.5 లక్షలకు పైబడి విలువ గల గంజాయి జప్తు చేశామంది.