IRCTC Ooty Tour: ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తిరుపతి నుంచి IRTC ప్యాకేజీ ఇదే-irctc tourism announced ooty tour from tirupati city check full details rae here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Ooty Tour: ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తిరుపతి నుంచి Irtc ప్యాకేజీ ఇదే

IRCTC Ooty Tour: ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తిరుపతి నుంచి IRTC ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 07:46 PM IST

IRCTC Ooty Tour Package : మీకు ఊటీకి వెళ్లాలని ఉందా? అయితే ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తిరుపతి - ఊటీ టూర్
తిరుపతి - ఊటీ టూర్ (twitter)

IRCTC Tourism Tirupati Ooty Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

Tirupati Ooty Tour Schedule: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 17వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. ఆరు రోజుల ప్లాన్ ఎలా ఉంటుందో చూస్తే....

Day - 01 Tuesday: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.55 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.

Day - 02 Wednesday: ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day - 03 Thursday: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.

Day - 04 Friday: బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

Day - 05 Saturday: హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.

Day - 06 Sunday: రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధరలివే.....

Tirupati Ooty Tour Cost: కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 25,420 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 13,780 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.10,870గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

తిరుపతి - ఊటీ టూర్ వివరాలు
తిరుపతి - ఊటీ టూర్ వివరాలు (irctc tourism)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

Whats_app_banner