UIDAI Grievance Centre : హైదరాబాద్‌లో 'ఆధార్‌ గ్రీవెన్స్‌ సెంటర్‌'.. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు -uidai opens new grievance redressal centre in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Uidai Opens New Grievance Redressal Centre In Hyderabad

UIDAI Grievance Centre : హైదరాబాద్‌లో 'ఆధార్‌ గ్రీవెన్స్‌ సెంటర్‌'.. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 04:01 PM IST

UIDAI Grievance Redressal Centre Hyderabad: ఆధార్ సేవలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ(UIDAI ). హైదరాబాద్ కేంద్రంగా కొత్తగా 'గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సెంటర్‌’ను ప్రారంభించింది.

హైదరాబాద్  ఆధార్‌ గ్రీవెన్స్‌ సెంటర్‌
హైదరాబాద్ ఆధార్‌ గ్రీవెన్స్‌ సెంటర్‌ (twitter)

UIDAI Grievance Redressal Centre: ఆధార్ సేవలకు సంబంధించి హైదరాబాద్ వేదికగా గ్రీవెన్స్ సెంటర్ ప్రారంభించింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ. హైదరాబాద్‌లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా ‘గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సెంటర్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతిరోజూ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సెంటర్ ను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రజలకు ఆధార్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు సుమారు 200 మంది వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సరైన సదుపాయాలు లేకపోవటం, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.... ప్రత్యేకంగా అన్ని రకాల వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. వీల్ చైన్ వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఆధార్ అప్డేట్….

మార్చి 15 నుండి 14 జూన్ 2023 వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని కూడా యూఏఐడీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆన్‍లైన్ ద్వారానే ఈ ఉచిత సదుపాయం ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది తీసుకొచ్చామని యూఐడీఏఐ తెలిపింది. అలాగే మూడు నెలల పాటు మాత్రమే ఆన్‍లైన్‍లో ఈ ఉచిత అప్‍డేట్ అవకాశం ఉంది. ఆ తర్వాత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలను ఆన్‍లైన్‍లో అప్‍డేట్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఉచిత సదుపాయం ఉంటుంది. మైఆధార్ వెబ్‍సైట్/పోర్టల్‍(myaadhaar.uidai.gov.in)లో ఆధార్ వివరాలను అప్‍డేట్ చేసుకుంటే ఉచితం. ఒకవేళ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‍డేట్ చేసుకుంటే సాధారణంగా రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‍లైన్ చేసుకుంటే ఉచితమే.

Pan - Aadhaar Link: మరోవైపు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)కు ఆధార్ (Aadhaar) అనుసంధానం (Link) తుది గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ విషయంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. గడువు ముగిసేలోగా పాన్ - ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకోవాలని లేకపోతే.. జూలై 1 నుంచి పాన్ నిరర్ధకంగా మారుతుందని స్పష్టం చేసింది. అంటే ఆధార్ - పాన్ అనుసంధానం జూన్ 30లోగా పూర్తి చేసుకోకుంటే ఆ తర్వాత పాన్ కార్డు పని చేయదు. పాన్‍కు సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోతాయి. పాన్ - ఆధార్ అనుసంధానం తుది గడువు మార్చి 31గా ఉండగా.. ఇప్పుడు దాన్ని జూన్ 30 వరకు పొడిగించింది కేంద్రం. పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

PAN - Aadhaar Link: పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసుకోండిలా..

ముందుగా www.incometax.gov.in వెబ్‍సైట్‍కు వెళ్లండి.

హోం పేజీ క్విక్ లింక్స్ (Quick Links) సెక్షన్‍లో లింక్ ఆధార్ స్టేటస్ (Link Aadhaar Status) అనే ఆప్షన్ కనిపిస్తుంది.

లింక్ ఆధార్ స్టేటస్‍పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.

ఆ తర్వాత ముందుగా పాన్ నంబర్, ఆ తర్వాత ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.

అనంతరం కింద ఉండే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ (View Link Aadhaar Status)పై క్లిక్ చేయండి.

మీ పాన్ కార్డు ఆధార్ నంబర్‌తో లింక్ అయిందో లేదో అక్కడ చూపిస్తుంది. లింక్ అయి ఉంటే సక్సెస్‍ఫుల్‍గా లింక్ అయిందని చూపిస్తుంది.

లింక్ కాకపోతే అనుసంధానం చేసుకునేందుకు లింక్‍ను చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం