Demat account nominee : ఇలా చేయకపోతే మీ డీమాట్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది- ఈ నెల 31 డెడ్‌లైన్!
Demat account nominee : మీరు డీమాట్ అకౌంట్ వాడుతున్నారా? మీ నామినీ వివరాలను యాడ్ చేశారా? లేకపోతే.. ఈ నెల 31 తర్వాత మీ డీమాట్ అకౌంట్ పనిచేయకపోవచ్చు!
Demat account nominee : స్టాక్స్ కొనడం, అమ్మడం కోసం మీరు డీమాట్ అకౌంట్ వాడుతున్నారా? మ్యూచువల్ ఫండ్స్ కోసం ప్రత్యేకించి యాప్‌ను వినియోగిస్తున్నారా? ఆయా అకౌంట్లకు 'నామినీ'లను యాడ్ చేయకపోతే.. అవి త్వరలోనే ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. నామినీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ నెల 31 చివరి తేది.
ట్రేడింగ్, డిమాట్ అకౌంట్లకు నామినీలకు యాడ్ చేయాలని.. 2021 జులైలోనే ప్రకటన విడుదల చేసింది మార్కెట్ రెగ్యులేటరీ సెబీ. వాస్తవానికి ఆ గడువు 2022 మార్చ్‌తో ముగియాల్సి ఉంది. కాగా.. వివిధ వర్గాల నుంచి అందిన ఫిడ్బ్యాక్తో.. గడువును 2023 మార్చ్ 31 వరకు పొడగించింది.
Demat account nominee update : జులై 2021 సెబీ ప్రకటనకు ముందు నామినీ వివరాలను వెల్లడించిన వారు.. మళ్లీ వివరాలు సమర్పించాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అది పూర్తిగా ఆప్షనల్ అని సెబీ స్పష్టం చేసింది. నామినీని పెట్టడం ఇష్టం లేకపోతే.. 'ఆప్ట్-ఔట్' ఆప్షన్ని కూడా ఎంచుకునే వెసులుబాటును కల్పించింది సెబీ. అయితే.. 31వ తేదీలోపు ఈ రెండిట్లో ఏదో ఒక దానిని కచ్చితంగా చేయాల్సి ఉంటుంది.
ఒక అకౌంట్లో ఒకరు కన్నా ఎక్కువ మంది నామినీలను యాడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది సెబీ. అయితే.. ఒక్కొక్కరికి ఎంత శాతం షేర్లు చెందాలి? అన్నది మాతం ముందే స్పష్టం చేయాల్సి ఉంటుంది.
డీమాట్ అకౌంట్లో నామినీలను యాడ్ చేయండిలా..
స్టెప్ 1:- మీ డీమాట్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
Demat account nominee last date : స్టెప్ 2:- ప్రొఫైల్‌లోని 'మై నామినీస్' సెక్షన్లోకి వెళ్లండి. నామినీ డీటైల్స్ పేజీలోకి మీరు రీడైరక్ట్ అవుతారు.
స్టెప్ 3:- నామినీని ఎంచుకోవచ్చు లేదా ఆప్ట్-ఔట్ ఆప్షన్ కూడా ఉంటుంది.
స్టెప్ 4:- నామినీ వివరాలను నింపాల్సి ఉంటుంది. నామినీకి సంబంధించిన ఏదైనా ఐడీ ప్రూఫ్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ షోర్లు ఇస్తున్నారో కూడా చెప్పాలి.
Demat account nominee news : స్టెప్ 5:- సబ్మీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 6:- ఆధార్ ఓటీపీతో డాక్యుమెంట్‌పై ఈ-సైన్ చేయాలి.
మీరు ఇచ్చిన నామినీ వివరాల వెరిఫికేషన్‌కు 24-48 గంటల సమయం పడుతుంది.
సంబంధిత కథనం