తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ ... 11 వేల ధరలో 6 రోజుల ట్రిప్, ప్యాకేజీ వివరాలివే

IRCTC Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ ... 11 వేల ధరలో 6 రోజుల ట్రిప్, ప్యాకేజీ వివరాలివే

HT Telugu Desk HT Telugu

25 March 2023, 14:03 IST

  • IRCTC Ooty Tour Package : సమ్మర్ లో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. వెళ్లే తేదీలతో పాటు ధరల వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ - ఊటీ టూర్
హైదరాబాద్ - ఊటీ టూర్ (facebook)

హైదరాబాద్ - ఊటీ టూర్

IRCTC Tourism Ooty Package: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఊటీతో పాటుగా కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 4వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే...

Day 1 : ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి.

Day 2 : రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.

Day 3 : మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.

Day 4 : నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.

Day 5 : ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.

Day 6 : ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధరల వివరాలు:

ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,220గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,330, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,410గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తిగా ధరల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.