IRCTC karnataka Tour: తిరుపతి - కర్ణాటక టూర్... 12 వేల ధరలో 6 రోజుల ట్రిప్, తాజా ప్యాకేజీ ఇదే -irctc tourism latest coastal karanataka tour from tirupati city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Tourism Latest Coastal Karanataka Tour From Tirupati City

IRCTC karnataka Tour: తిరుపతి - కర్ణాటక టూర్... 12 వేల ధరలో 6 రోజుల ట్రిప్, తాజా ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu
Mar 26, 2023 07:00 PM IST

IRCTC Coastal Karnataka Tour Package : కర్ణాటక టూర్ వెళ్లాలని ఉందా? అయితే ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. తేదీలు, ధరలు, చూసే ప్రాంతాల వివరాలను పేర్కొంది.

తిరుపతి - కర్ణాటక టూర్
తిరుపతి - కర్ణాటక టూర్ (facebook)

IRCTC Tourism Tirupati - Coastal Karnataka Tour: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.తాజాగా తిరుపతి నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'COASTAL KARNATAKA EX RENIGUNTA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో గోకర్ణ, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర్, శృంగేరి, ఉడిపి వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రతి మంగళవారం రోజుల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ షెడ్యూల్ చూస్తే….

Day 01 Tuesday: కడప నుంచి మధ్యాహ్నం 02.30 నిమిషాలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 04.50 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 02 Wednesday: ఉదయం 09.30 నిమిషాలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... శ్రీకృష్ణ టెంపుల్, సెయింట్ మెరీస్ ఐల్యాండ్, మల్పి బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

Day 03 Thursday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ్నుంచి కొల్లూరులోని మూకాంబికా ఆలయానికి వెళ్తారు. అనంతరం మురుడేశ్వర్ కు పయనమవుతారు. హెటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... రాత్రి మురుదేశ్వర్ లోనే బస చేస్తారు.

Day 04 Friday: జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్ణకు బయల్దేరుతారు. ఆలయంతో పాటు బీచ్ కు వెళ్తారు. తిరిగి మురుడేశ్వర్ కు వస్తారు. రాత్రి అక్కడ బస చేస్తారు.

Day 05 Saturday: చెక్ అవుట్ అయి మంగళూరుకు చేరుకుంటారు. కాటేల్ ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు వస్తారు. మంగళాదేవి ఆలయానికి వెళ్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 నిమిషాలకు రైలు బయల్దేరుతుంది.

Day 06 Sunday: మధ్యాహ్నం 12.05 రేణిగుంట, 01.53కు కడప చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు ఇవే…

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ షేరింగ్ కు రూ. 33,280ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,570 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,480 గా ఉంది. 3 టైర్ ఏసీ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేర్ ధరకు రూ. 30,890గా ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 16,180గా ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

తిరుపతి - కర్ణాటక ట్రిప్ ధరలు
తిరుపతి - కర్ణాటక ట్రిప్ ధరలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం