IRCTC Tourism Ooty Package: వేర్వురు ప్రదేశాలను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. తక్కువ ధరలో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 21వ తేదీన అందుబాటులో ఉంది.