తెలుగు న్యూస్  /  Telangana  /  Imd Issued Yellow Alert To Various Districts In Telangana Check Full Details Are Here

TS Weather Alert : మరో 4 రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu

22 April 2023, 17:47 IST

    • Weather Updates Telugu States: ఇవాళ భానుడి భగభగలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పలు జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో వర్షాలు

Rain Alert to Telangana : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో తీవ్ర వేడిగాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

2 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

ఎల్లో అలర్ట్….

ఏప్రిల్ 26 తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలప్లలి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30- 40 కి. మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక మిగతా జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. హైదరాబాద్ లో ఇవాళ రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. పంటల విషయంలో రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీకి వర్ష సూచన…

ఏపీకి కూడా వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి గాలుల ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని తెలిపింది. ఇక వర్షాల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని అంచనా వేసింది.

ఇక వేసని నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తగినంత స్థాయిలో నీరు తాగాలని చెబుతున్నారు. నేరుగా ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకువాలని అంటున్నారు.బయటికు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.