Telangana Weather Alert : మరో 4 రోజులు వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ-rain alert to telangana and imd issued yellow alert check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rain Alert To Telangana And Imd Issued Yellow Alert Check Full Details Are Here

Telangana Weather Alert : మరో 4 రోజులు వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 06:07 PM IST

Weather Updates Telugu States: ఓవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే గురువారం పలుచోట్ల వర్షం కురవటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే గురువారం హైదరాబాద్ లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం పడింది. ఫలితంగా ఉక్కపోత కాస్త తగ్గముఖం పట్టింది. రెండు మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగర ప్రజలకు వరుణుడి రాకతో కాస్త ఉపశమనం దొరికినట్లు అయింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్…

శుక్రవారం కూడా ఉదయం వేళ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. అయితే మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు పడుతాయని తెలిపింది. అయితే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. గాలి వేగం గంటకు 30 -40 కి.మీ వీస్తాయని వెల్లడించింది. పలుచోట్ల వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడకక్కడ కురుస్తాయని స్పష్టం చేసింది.

Today Andhrapradesh Temperatures : మరోవైపు ఏపీలో రోజురోజూకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండి అంచనాల పలు మండాలలకు హెచ్చరికాలు ఇచ్చింది. రేపు 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. తగినంత స్థాయిలో నీరు తాగాలని.. ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని వెల్లడించింది. బయటకు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అధికారులు అడ్వైజ్ కూడా చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.

IPL_Entry_Point