India heatwave 2023 : మార్చ్​లో అకాల వర్షాలు.. జూన్​ వరకు భానుడి భగభగలు!-india predicts a hotter summer raising power supply worries ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Predicts A Hotter Summer, Raising Power Supply Worries

India heatwave 2023 : మార్చ్​లో అకాల వర్షాలు.. జూన్​ వరకు భానుడి భగభగలు!

Sharath Chitturi HT Telugu
Apr 02, 2023 06:52 AM IST

India heatwave 2023 : దేశంలో మార్చ్​ నెలలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జూన్​ వరకు హీట్​ వేవ్స్​ ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి!

మార్చ్​లో అకాల వర్షాలు.. జూన్​ వరకు భానుడి భగభగలు!
మార్చ్​లో అకాల వర్షాలు.. జూన్​ వరకు భానుడి భగభగలు! (HT_PRINT)

India heatwave 2023 : దేశంలో భానుడి భగభగలతో భయపడిపోతున్న ప్రజలకు మరో చేదు వార్త! ఈ వేసవిలో జూన్​ వరకు.. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హీట్​ వేవ్స్​ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యుత్​​ వినియోగం అంచనాలకు మించి పెరగనుంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నిన్న వర్షాలు.. నేడు హీట్​ వేవ్​..!

Temperature rise in India : దేశంలోని కేంద్ర, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో.. రానున్న మూడు నెలల పాటు ప్రజలను హీట్​ వేవ్స్​ ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయని.. ఐఎండీ (భారత వాతావరణశాఖ) డైరక్టర్​ జనరల్​ మృత్యుంజయ్​ మోహాపాత్ర తెలిపారు. దేశంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటానికి అంతర్జాతీయంగా వాతావరణ మార్పులు కారణ అని వివరించారు.

సాధారణంగా మార్చ్​ నెలలో వర్షాలు పడవు. కానీ ఈసారి.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. సాధారణం కన్నా ఇది 26శాతం ఎక్కువ. ఫలితంగా చేతికి అందాల్సిన గోధుమ, ఉల్లితో పాటు ఇతర పంటలు నాశనమైపోయాయి. ఈ పరిణామాలతో సప్లై చెయిన్​ వ్యవస్థ దెబ్బతిని, ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక రానున్న హీట్​ వేవ్స్​తో పంట సరిగ్గా పండుతుందా? లేదా? అన్న భయాలు రైతుల్లో నెలకొంది.

India Heatwave latest news : దేశంలోని అనేక ప్రాంతాల్లో.. మార్చ్​ నెల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ నమోదయ్యాయి. అకాల వర్షాలే ఇందుకు కారణం.కాగా.. కేంద్ర, దక్షిణ, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది.

ఇక ఏప్రిల్​లో.. బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ ప్రదేశ్​, ఒడిస్సా, పశ్చిమ్​ బెంగాల్​, మహారాష్ట్ర, గుజరాత్​, పంజాబ్​, హరియాణా, ఛత్తీస్​గఢ్​లలో హీట్​ వేవ్స్​ ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

కేంద్రం సన్నద్ధం..

Heat wave in April in India : భారీ ఉష్ణోగ్రతల అంచనాల నేపథ్యంలో కేంద్రం సన్నద్ధమవుతోంది. ఏప్రిల్​లో విద్యుత్​ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుందని సంబంధిత మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. బొగ్గును దిగుమతి చేసుకుని విద్యుత్​ ఉత్పత్తిని పెంచాలని పవర్​ ప్లాంట్​లకు ఆదేశాలిచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం