తెలుగు న్యూస్  /  Telangana  /  Gold Chain Melt After Lightning Strike On Woman In Adilabad

Lightning Strike : పిడుగుపాటుకు ఒంటిపైనే కరిగిపోయిన బంగారం

HT Telugu Desk HT Telugu

16 October 2022, 17:10 IST

    • Rain In Adilabad : పిడుగు పడితే చనిపోవడమో.. లేదా గాయలు అవడమో జరిగిందని వింటుంటాం. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. పిడుగుపడి మెడలోని బంగారం కరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ(Telangana)లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు(Rains) విపరీతంగా పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని ప్రదేశాల్లో పిడుగులు(Thunders) పడుతున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా పొచ్చర సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో పిడుగుపడింది. దీంతో మహిళపై ఉన్న బంగారం(Gold) అంతా కరిగిపోయి.. ఒంటికే అంటుకుపోయింది. ఆమెకు గాయాలయ్యాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

శ్వేత అనే మహిళ దిమ్మ గ్రామ శివారులోని పొలంలో పనిచేస్తూ ఉంది. అప్పటికే ఉరుములు మెరుపులు ఉన్నాయి. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆమె తన పని తాను చేసుకుంటుంది. ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో శ్వేత మెడలోని బంగారం గొలుసు(Gold Chain) కరిగిపోయింది. ఒంటికి అతక్కుపోయింది. ఆమెకు గాయాలయ్యాయి.

అక్కడే దగ్గరలో వేరే పొలంలో పని చేస్తున్న వారు.. శ్వేత కిందపడిపోవడం చూశారు. వెంటనే పరుగున వచ్చారు. చూసేసరికి శ్వేత స్పృహ తప్పిపడిపోయింది. ఆమె మెడలోని బంగారం గొలులు కరిగిపోయి కనిపించింది. ఆమెను 108 వాహనంలో ఆదిలాబాద్‌(Adilabad)లోని రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి విస్తరించి ఉందని పేర్కొంది. ఈనెల 18న అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది.

పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్‌ తీరం దిశగా పయనమవుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్‌ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.