తెలంగాణ: బహుముఖ పేదరిక సూచీలో ఆదిలాబాద్‌కు ఒకటో స్థానం-adilabad tops multidimensional poverty index by niti ayog ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Adilabad Tops Multidimensional Poverty Index By Niti Ayog

తెలంగాణ: బహుముఖ పేదరిక సూచీలో ఆదిలాబాద్‌కు ఒకటో స్థానం

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 12:25 PM IST

Poverty Index: నీతి ఆయోగ్ రూపొందించిన బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌)లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉంది. పేదరికం అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ నిలిచాయి.

ప్రతీకాత్మక చిత్రం : దేశంలో పేదరికం అనుభవిస్తున్న ప్రజలు (pc: varun tondon, unsplash)
ప్రతీకాత్మక చిత్రం : దేశంలో పేదరికం అనుభవిస్తున్న ప్రజలు (pc: varun tondon, unsplash) (unsplash)

రాష్ట్రంలో విభిన్న రంగాల్లో 13.74 శాతం మంది పేదరికాన్ని అనుభవిస్తున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 ను బేస్ లైన్‌గా తీసుకుని ఈ నివేదికను రూపొందించిన నీతిఆయోగ్ 2021, నవంబరు 26న ఆవిష్కరించింది.

ట్రెండింగ్ వార్తలు

కేవలం ఆదాయం ప్రాతిపదికన కాకుండా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు తదితర మూడు కేటగిరీలను ఎంచుకుని, వీటిలో విభిన్న సూచీలకు స్కోర్ కేటాయించింది. ఆరోగ్యంలో పౌష్ఠికాహారం, శిశు, కౌమారదశ మరణాలు, శిశు ఆరోగ్యం సూచీలను, అలాగే విద్యలో పాఠశాల సంవత్సరాలు, పాఠశాల హాజరు సూచీలను పరిగణనలోకి తీసుకుంది. 

జీవన ప్రమాణాలలో వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, నివాస గృహం, ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలు తదితర సూచీలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

తెలంగాణలో అంశాల వారీగా పేదరికం ఎదుర్కొంటున్న జనాభా శాతం

 అంశంజనాభా (శాతం)పారామితి
పౌష్ఠికాహార లోపం 31.1 ఐదేళ్లలోపు చిన్నారులు, 15-49 ఏళ్ల మహిళలు, 15-54 ఏళ్ల పురుషులు
 శిశు, కౌమార దశ మరణాలు1.4 ఐదేళ్ల ముందు వరకు ఆ కుటుంబంలో చనిపోయిన 18 ఏళ్లలోపు పిల్లలు
 శిశు ఆరోగ్యం  10.9 చిన్నారులకు వైద్య సిబ్బంది ద్వారా సేవలు అందకపోవడం
 పాఠశాల సంవత్సరాలు 15.8 ఒక కుటుంబంలో పదేళ్లు, అంతకుమించి వయస్సు ఉన్న వారిలో కనీసం ఒక్కరూ ఆరేళ్ల పాఠశాల విద్య పూర్తిచేయకపోవడం
 పాఠశాల హాజరు 2.1 ఎనిమిదో తరగతి పూర్తిచేసే వయసొచ్చినా బడికి వెళ్ళని వారు
 వంట ఇంధనం 31.7 కట్టెలు, పేడ, బొగ్గు, వ్యవసాయ వ్యర్థాలతో వంట చేసుకునే కుటుంబాలు
 పారిశుద్ధ్యం 49.3 పారిశుద్ధ్య వ్యవస్థ లేని కుటుంబాలు, లేదా ఇతర కుటుంబాలతో కలిసి వాడుకునే వారు
 తాగునీరు 27.8 ఇంటి నుంచి వెళ్లి సురక్షిత నీళ్లు తెచ్చకునేందుకు కనీసం 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టడం
విద్యుత్తు1.2విద్యుత్తు సరఫరా లేని కుటుంబాలు
నివాసం25.5పక్కా ఇల్లు లేని కుటుంబాలు
ఆస్తులు12.8రేడియో, టీవీ, టెలిఫోన్, కంప్యూటర్, సైకిల్, మోటార్ బైక్, ఫ్రిజ్ వంటి వాటిలో ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు లేకపోవడం, అలాగే కారు, ట్రక్కు వంటివి లేకపోవడం
బ్యాంకు ఖాతాలు7.5బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతాలు లేని కుటుంబాలు

ఏ జిల్లాలో ఎక్కువ పేదరికం ఉంది?

తెలంగాణలో మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ప్రకారం అత్యంత ఎక్కువగా పేదరికం ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ. ఏ జిల్లాలో ఎంత పేదరికం ఉందో కింది పట్టికలో చూడవచ్చు.

జిల్లాపేదరికం శాతం
ఆదిలాబాద్27.43
మహబూబ్ నగర్26.11
నిజామాబాద్21.41
మెదక్17.9
నల్గొండ15.3
ఖమ్మం13.75
వరంగల్12.45
కరీంనగర్9.20
రంగారెడ్డి5.83
హైదరాబాద్4.27

బహుముఖ పేదరిక సూచీలో రాష్ట్రాల స్థానం ఇలా..

రాష్ట్రంవిభిన్న రంగాల్లో పేదరికం అనుభవిస్తున్న జనాభా శాతం
బిహార్51.91
జార్ఖండ్42.16
ఉత్తర ప్రదేశ్37.79
మధ్య ప్రదేశ్36.65
మేఘాలయ32.67
ఛత్తీస్ గఢ్29.91
రాజస్తాన్29.46
ఒడిశా29.46
నాగాలాండ్25.23
అరుణాచల్ ప్రదేశ్24.27
పశ్చిమ బెంగాల్21.43
గుజరాత్18.60
మణిపూర్17.89
ఉత్తరాఖండ్17.72
త్రిపుర16.65
మహారాష్ట్ర14.85
తెలంగాణ13.16
ఆంధ్రప్రదేశ్12.31
హర్యానా12.28
మిజోరం9.80
హిమాచల్ ప్రదేశ్7.62
పంజాబ్5.59
తమిళనాడు4.89
సిక్కిం3.82
గోవా3.76
కేరళ0.71

కేంద్ర పాలిత ప్రాంతాలు

కేంద్ర పాలిత ప్రాంతంపేదరికం అనుభవిస్తున్న జనాభా (శాతం)
దాద్రా నగర్ హవేలీ27.36
జమ్మూకశ్మీర్ లద్దాఖ్12.56
దామన్ డయ్యూ6.82
ఛండీగఢ్5.97
ఢిల్లీ4.79
అండమాన్ నికోబార్ దీవులు4.30
లక్ష ద్వీప్1.82
పుదుచ్చేరి1.72

IPL_Entry_Point