తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Ed Enquiry : ముగిసిన విచారణ.. 8గంటలకుపైగా కవితకు ఈడీ ప్రశ్నలు

MLC Kavitha ED Enquiry : ముగిసిన విచారణ.. 8గంటలకుపైగా కవితకు ఈడీ ప్రశ్నలు

HT Telugu Desk HT Telugu

21 March 2023, 21:20 IST

  • Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. సమారు.. ఎనిమిదిన్నర గంటలపాటు.. అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

దేశవ్యాప్తంగా సంచలనమైన దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను వరుసగా విచారణ చేసింది. దిల్లీలో వరుసగా రెండోరోజు ఈడీ అధికారులు సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు కవితను విచారణ చేశారు. ఉదయం 11 గంటలకు మెుదలైన విచారణ.. రాత్రి 8.30 గంటల వరకూ సాగింది. దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. సౌత్ గ్రూప్(South Group), పిళ్లైకి సంబంధించి.. ఎక్కువ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

ఉదయం ఈడీ కార్యాలయానికి కవిత తన ఫోన్లను(Kavitha Phones) తీసుకుని వెళ్లారు. అంతకుముందు.. ఆ ఫోన్లను రెండు చేతుల్లో పట్టుకుని.. చూపించారు. కవిత కొన్ని నెలల్లోనే పది ఫోన్లను మార్చారని ఈడీ అంటోంది. ఆమె ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది. ఈ నేపథ్యంలో విచారణకు కవిత తన ఫోన్లను తీసుకుని వెళ్లారు. వాటిని ఈడీ అధికారులకు అప్పగించారు.

కవిత ఇచ్చిన ఫోన్లలోని డేటాను ఈడీ అధికారులు(ED Officials) విశ్లేషిస్తున్నారు. మంగళవారం ఎనిమిది గంటలకుపైగా ఎంక్వైరీ చేశారు. కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. రానున్న రోజుల్లో ఆమెకు మరిన్ని సమన్లు జారీ చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఇప్పటికే కవితకు సంబంధించిన వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. స్టేట్ మెంట్లను కూడా తీసుకున్నారు అధికారులు. ముందుగానే లిక్కర్ పాలసీ(Liquor Policy) డ్రాఫ్ట్ కాపీ కవిత ఫోన్ లోకి వచ్చిందా? లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి? సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు?లాంటి ప్రశ్నలను ఈడీ వేసినట్టుగా తెలుస్తోంది.

కవితను విచారించే సమయంలో బీఆర్ఎస్(BRS) లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్ ను పిలిచారు. కవితకు సంబంధించి.. ఆథరైజేషన్ సంతకాల కోసం పిలిచినట్టుగా తెలుస్తోంది. దిల్లీ ఈడీ కార్యాలయంలోని(Delhi ED Office) మూడో ఫ్లోర్ లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను మార్చి 11న మెుదటి సారి 8 గంటలపాటు ఈడీ విచారణ చేసింది. ఆ తర్వాత మార్చి 20న 10 గంటలు, మార్చి 21న ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ చేశారు.

ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తు్న్నానని కవిత చెప్పారు. ఈ మేరకు ఈడీ అసిస్టెండ్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన పది ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్టుగా కవిత తెలిపారు. మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా.. మెుబైల్ ఫోన్ల(Mobile Phones)ను కోరారని, అయినా తాను ఉపయోగించిన ఫోన్లు జమ చేస్తున్నట్టుగా కవిత వెల్లడించారు.