Liquor Scam MLC Kavitha: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత-brs mlc k kavitha appears at the enforcement directorate office in connection with the delhi excise policy case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /   Brs Mlc K Kavitha Appears At The Enforcement Directorate Office In Connection With The Delhi Excise Policy Case

Liquor Scam MLC Kavitha: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 11:14 AM IST

Liquor Scam MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. గత వారం తన న్యాయవాదితో ఈడీ కోరిన సమాచారాన్ని పంపిన ఎమ్మెల్సీ కవిత, తాజా నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (PTI)

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై న్యాయవాదులతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈడీ విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆమె వెంట భర్తతో పాటు.. ఇతర బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఉన్నారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గరే ఇతర నేతలు అందర్నీ నిలిపివేశారు. కవిత లాయర్ ను కూడా అనుమతించలేదు. కేవలం కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు.

ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు. తన న్యాయవాది ద్వారా ఈడీ కోరిన సమాచారాన్ని పంపారు. దీంతో 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ ఆదేశంతోనే కవిత విచారణకు హాజరయ్యారు. వెళ్తారా లేదా అనే సందేహాలను తోసిపుచచి విచారణకు హాజరయ్యారు కవిత.

ఈడీ ఆఫీసులోకి వెళుతున్న సమయంలో.. పిడికిలి బిగించి అభిమానులకు అభివాదం చేశారు. కవిత ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆఫీసులోకి వెళుతున్న సమయంలో భర్త వెన్నంటే ఉండి.. భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ గత వారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో కలిసి ఆదివారమే ఢిల్లీకి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ క‌వితను ఇప్పటికే సీబీఐ విచారించింది. ఆ తర్వాత మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచార‌ణ‌కు కవిత హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల‌కు వెళ్లిన ఎమ్మెల్సీ క‌విత రాత్రి 8.05 నిమిషాల‌కు తిరిగి వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది.

మరోవైపు ఈడీ విచారణ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సాగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఈ నెల 24న విచారణకు రానుంది. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ప్రివన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, విచారణ నుంచి మిన‍హాయింపు కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

IPL_Entry_Point