తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mmts Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... కొత్తగా 40 Mmts సర్వీసులు, నడిచే రూట్లు ఇవే

MMTS Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... కొత్తగా 40 MMTS సర్వీసులు, నడిచే రూట్లు ఇవే

HT Telugu Desk HT Telugu

19 April 2023, 20:02 IST

    • Hyderabad MMTS Trains Services: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో అదనంగా ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనుంది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
అదనపు ఎంఎంటీఎస్‌ సేవలు
అదనపు ఎంఎంటీఎస్‌ సేవలు

అదనపు ఎంఎంటీఎస్‌ సేవలు

MMTS Train Services Updates: ప్రయాణికులకు కీలక అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. వేసవిలో రాకపోకలు పెరిగిన దృష్ట్యా... అదనంగా ఎంఎంటీస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా.. కొత్తగా 40 సర్వీసులను ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్‌ – మేడ్చల్‌ మధ్య 20 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరో 20 రైళ్లు..... ఫలక్‌నుమా – ఉందానగర్‌ మధ్య నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పాత, కొత్త సర్వీసులు అన్ని కలపి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే వాటి సంఖ్య 106కు చేరినట్లు అయింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Karimnagar : కరీంనగర్ లో గాలి వాన బీభత్సం, సీఎం రేవంత్ రెడ్డి టూర్ రద్దు

Khammam Accident : ఖమ్మంలో విషాదం- రేపు బర్త్ డే, రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

40 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులు - వివరాలు

మరోవైపు ఎంఎంటీఎస్‌ రెండో దశపై కూడా ఫోకస్ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే. 2024 జనవరి నాటికి పూర్తి రెండో దశను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 50 కిమీ మేర ఎంఎంటీఎస్ రెండో దశ అందుబాటులోకి రాగా... మరో 50 కి.మీ లను జనవరి 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 ఆరంభం నుంచి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సనత్‌నగర్‌- మౌలాలి మధ్య 21 కి.మీ., సికింద్రాబాద్‌-ఘట్‌కేసర్‌ మధ్య 19 కి.మీ., సీతాఫల్‌మండి-మౌలాలి-మల్కాజిగిరి మధ్య 10 కి.మీ. ఇలా మొత్తం 50 కి.మీ పూర్తి చేయనున్నారు.

ప్రత్యేక రైళ్లు….

వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 44 వేసవి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్‌-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతారు.ట్రైన్ నంబర్ 07189/07190 నాందేడ్-ఈరోడ్-నాందేడ్ స్పెషల్‌ ట్రైన్‌ను ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 వరకు నడుపుతారు. నాందేడ్‌ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.20కు బయల్దేరే రైలు శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07190 స్పెషల్ ట్రైన్ ఈరోడ్‌లో ఆదివారం ఉదయం 5.15కు బయల్దేరి సోమవారం ఉదయం 7.30కు నాందేడ్ చేరుతుంది. ఈరోడ్- నాందేడ్ ఈ రైలు ఏప్రిల్ 23 నుంచి జులై 2వరకు నడుపన్నారు.

నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైలు ముద్ఖేడ్, ధర్మాబాద్‌, బాసర,నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుుంది ట్రైన్ నంబర్ 08311 సంబల్పూర్-కోయంబత్తూరు ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 10.55కు బయల్దేరి గురువారం రాత్రి 9.40కు కోయంబత్తూరు చేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28వరకు ఈ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 08312గా కోయంబత్తూరులో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12కు బయల్దేరి శనివారం రాత్రి 9.15కు సంబల్పూర్ చేరుతుంది. ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.

సంబల్పూర్-కోయంబత్తూరు- సంబల్పూర్ రైలు బార్గార్ రోడ్, బాలాంగిర్‌, తిట్లఘర్‌, కేసింగా, మునిగూడ, రాయగూడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్త వలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం జంక్షన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల,ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్, థర్డ్ ఏసి, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.