HYD MMTS Trains: పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు - వివరాలివే-cancellation of mmts train services on 10th july 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Mmts Trains: పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు - వివరాలివే

HYD MMTS Trains: పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 08:47 AM IST

హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. ఇవాళ(జూలై 10) పలు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు
పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

Cancellation of MMTS Train Services: దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇవాళ పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిర్వహణ పనుల కారణంగా నగరంలోని వివిధ మార్గాల్లో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

వివరాలివే....

లింగంపల్లి - హైదరాబాద్ రూట్లలో 9 రైళ్లను నిలిపివేసింది. ఇక హైదరాబాద్ - లింగపల్లి రూట్ లోనూ 9 సర్వీసులను రద్దు చేసింది. ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో ఆరు రైళ్లను, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో ఏడు, రాంచంద్రాపురం-ఫలక్‌నుమా మధ్య ఒక రైలును, హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య ఒక ఎంఎంటీఎస్‌ రైలును రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక రైళ్లు...

Special Trains Between Malkajgiri - Jalna: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 9, 16, 23, 30 తేదీల్లో మల్కాజిగిరి నుంచి 23.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07428)మరుసటి రోజు 10.20 గంటలకు జాల్నా చేరుకుంటుందని పేర్కొంది. ఇక జూలై 15, 22, 29 తేదీల్లో జాల్నా నుంచి 22.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07254) మరుసటి రోజు 8.50 గంటలకు మల్కాజిగిరి చేరుకుంటుందని వెల్లడించింది. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం