తెలుగు న్యూస్  /  Telangana  /   Hyderabad Likely To Get 2 More Vande Bharat Express Trains To Big Cities

Vande Bharat Trains: హైదరాబాద్‌ నుంచి మరో 2 వందే భారత్ రైళ్లు..! త్వరలోనే ఆ నగరాలకు పరుగులు

HT Telugu Desk HT Telugu

16 April 2023, 15:31 IST

    • Vande Bharat Trains to Hyderabad City: హైదరాబాద్ కు మరో 2 వందే భారత్ ట్రైన్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన విడుదలయ్యే  అవకాశం ఉంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (twitter)

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Vande Bharat express Trains: వందే భారత్ రైళ్లకు సంబంధించి హైదరాబాద్ కు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది దక్షిణ మధ్య రైల్వే. త్వరలోనే మరో రెండు వందే భారత్ రైళ్లను నడిపే దిశగా కరసత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు సర్వీసులను ప్రారంభించగా... కొత్తగా హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణె మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. త్వరలోనే ఈ సర్వీసులకు సంబంధించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

త్వరలోనే పరుగులు…!

అన్నీ కుదిరితే వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లోనే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే వచ్చే దిశగా దక్షిణ మధ్య రైల్వే అడుగులు వేస్తోంది. ఈ రెండింటిలో ఒక రైలు... కాచిగూడ-బెంగళూరు మధ్య నడపుతారు. మరోక ట్రైన్ సికింద్రాబాద్-పూణె మధ్య నడుతారు. ఐటీ హబ్ లుగా పేరున్న బెంగళూరు, పూణెలకు సర్వీసులు నడపటం ద్వారా.... ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించే అకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ రెండు సిటీల మధ్య అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ముందుగా కాచిగూడ-బెంగళూరు వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో నెలకు సికింద్రాబాద్-పుణె మధ్య వందే భారత్ ట్రైన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాగ్ నుంచి రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. తాజాగానే సికింద్రాబాద్ - తిరుపతి ట్రైన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గతంలో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రారంభించారు. ఈ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉంది. ఈ రెండు ట్రైన్లలో ఆక్సుపెన్సీ రేటు 99 శాతం తగ్గడం లేదు. రిజర్వేషన్లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ ట్రైన్లు విజయవంతం కావడంతో మరిన్ని వందే భారత్ ట్రైన్లను హైదరాబాద్ నుంచి నడిపేలా రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది.

ఛార్జీల వివరాలు..

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు... వారంలో ఆరు రోజులు సర్వీస్ అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నెంబర్ ( Train number 2070) సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయల్దేరి… మధ్యాహ్నం 02. 30 గంటలకు తిరుపతికి చేరుతుంది, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. ఈ ట్రైన్ లో 07 ఏసీ కోచ్ లు ఉంటాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ కారు కోచ్ కూడా ఉంటుంది. మొత్తం 530 ప్రయాణికులు రాకపోకలు కొనసాగించవచ్చు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1680గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.1168గా ఉంటే...రిజర్వేషన్ చార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జీ రూ.45, జీఎస్టీ రూ.63, క్యాటరింగ్ చార్జీలు 364గా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. .ఫుడ్ వద్దనుకుంటే... టికెట్ బుకింగ్ సమయంలో నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోవాలి.