తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Dost Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

03 May 2024, 13:57 IST

google News
    • Telangana Degree Admissions 2024: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ - 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ముఖ్య వివరాలను పేర్కొంది. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు 2024
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు 2024 (https://dost.cgg.gov.in/)

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు 2024

TS DOST Notification 2024 Updates: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం ‘దోస్త్’(TS DOST 2024) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్(Degree Online Services Telangana) రిజిస్ట్రేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో సీట్ల భర్తీని పూర్తి చేయనున్నారు.

దోస్త్ రిజిస్ట్రేషన్ ఫీజులు...

మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. అర్హత గల విద్యార్థులు మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్ సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు. జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.

TS DOST Registration 2024 -రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….

  • డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.
  • ఇందులో Candidate Pre-Registrationపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ముందుగా Application Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి.
  • Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

దోస్త్(TS DOST) రిజిస్ట్రేషన్ల ముఖ్య తేదీలివే..

  • ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. 
  • అర్హత గల విద్యార్థులు మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. 
  • ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్‌ 4 నుంచి 14 వరకు ఈ అవకాశం ఉంటుంది.
  • తొలి విడత  సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు. 
  • సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. 
  • రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది.
  • రెండో విడత సీట్లను  జూన్‌ 18వ తేదీన  కేటాయిస్తారు. 
  •  జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.
  • చివరి విడత జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.  జూన్‌ 25 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
  • జూన్ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి.
  •  జూన్‌ 29వ తేదీన తుది విడుత సీట్లను కేటాయిస్తారు. 
  • జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • జూలై 7వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు తరగతులు ప్రారంభమవుతాయి.

NOTE: ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 

తదుపరి వ్యాసం