Secunderabad Railway Station: ఎయిర్‌పోర్ట్‌ రేంజ్​లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే...! -pm modi will lay the foundation stone of redevelopment of secunderabad railway station on 8th april 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pm Modi Will Lay The Foundation Stone Of Redevelopment Of Secunderabad Railway Station On 8th April 2023

Secunderabad Railway Station: ఎయిర్‌పోర్ట్‌ రేంజ్​లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే...!

Apr 06, 2023, 05:22 PM IST HT Telugu Desk
Apr 06, 2023, 05:22 PM , IST

  • Redevelopment of Secunderabad Railway Station: ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు.  ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 719 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు విడుదలయ్యాయి.

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 

(1 / 8)

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేస్తారు. స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడనున్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీతో పాటు ప్రయాణికులను సులభంగా రాకపోకలు జరిపేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. 

(2 / 8)

మొత్తం 719 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

(3 / 8)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

(4 / 8)

కొత్త స్టేషన్‌ భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తరం వైపు మలి్టలెవల్‌ పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.  

(5 / 8)

టేషన్‌ పరిసరాల్లో  ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్‌మాల్స్,ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు

(6 / 8)

సికింద్రాబాద్‌ ఈస్ట్, సికింద్రాబాద్‌ వెస్ట్‌ మెట్రో స్టేషన్‌లకు చేరుకొనేందుకు స్కైవేలను అందుబాటులోకి తీసుకువస్తారు. స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

(7 / 8)

దక్షిణమధ్య రైల్వే స్వయంగా  ఈ ప్రాజెక్ట్ పనులను చేపట్టింది. కొద్ది రోజుల  క్రితమే  స్టేషన్‌ పరిధిలో  భూసార పరీక్షలను పూర్తి చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన తర్వాత... అధికారికంగా పనులు షురూ కానున్నాయి.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు