తెలుగు న్యూస్  /  Sports  /  Wtc Final 2023 Ajinkya Rahane Eye On Multiple Records In Wtc Final 2023 Ind Vs Aus Test

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆ రికార్డులపై రహానే కన్ను

Anand Sai HT Telugu

01 June 2023, 6:31 IST

    • Ajinkya Rahane : రహానే ఇప్పుడు WTC ఫైనల్స్ కోసం భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అనేక రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
రహానే
రహానే (twitter)

రహానే

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ జూన్ 7 నుంచి 11 మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరగనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు ఈ జట్టుతో ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ఇప్పటికే లండన్ చేరుకుంది. మూడో బ్యాచ్‌లో అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజా IPL 2023 ఫైనల్ తర్వాత లండన్ చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడిన అజింక్య రహానే 14 మ్యాచ్‌ల్లో 172.49 స్ట్రైక్ రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనే రహానెకు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం వచ్చేలా చేసింది. కాబట్టి రహానే ఇప్పుడు WTC ఫైనల్స్ కోసం భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అనేక రికార్డులను సృష్టించే అవకాశాన్ని పొందాడు.

భారత టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 4931 పరుగులు చేసిన రహానే ఇంకా 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేస్తాడు. టెస్టు క్రికెట్‌లో రహానే 12 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఇప్పటి వరకు ఆడిన 82 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు పట్టాడు. ఇంకొకటి పట్టుకుంటే 100 క్యాచ్‌లు పూర్తి చేస్తాడు. మొత్తంగా, రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12,865 పరుగులు చేశాడు. 135 పరుగులతో తన 13,000 పరుగులను పూర్తి చేస్తాడు.

మరోవైపు ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడనున్నాడు.

టాపిక్