IPL 2023 Prize Money : చెన్నైకి 20 కోట్లు.., రహానే, గిల్, షమీకి లక్షలు..-ipl 2023 csk gets 20 crore rahane gill shami also get money check full winner list of ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Csk Gets 20 Crore Rahane Gill Shami Also Get Money Check Full Winner List Of Ipl 2023

IPL 2023 Prize Money : చెన్నైకి 20 కోట్లు.., రహానే, గిల్, షమీకి లక్షలు..

HT Telugu Desk HT Telugu
May 30, 2023 08:58 AM IST

IPL 2023 Prize Money : ఐపీఎల్ పోరు ముగిసింది. గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. అయితే పలువురు ఆటగాళ్లు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌కు తెర పడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో సీఎస్‌కే ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం గుజరాత్‌పై చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా 1 ఫోర్, సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు. చివరి 2 బంతుల్లో విజయానికి 10 పరుగులు చేయాల్సి ఉండగా, రవీంద్ర జడేజా 1 ఫోర్, ఒక సిక్స్ కొట్టి గెలిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన CSK జట్టుకు 20 కోట్ల రూపాయలు అందుకుంటుంది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌కు 12.5 కోట్లు తీసుకుంటుంది. 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్‌తో పాటు రూ.10 లక్షలు అందుకున్నాడు. మహ్మద్ షమీ 17 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకుని 10 లక్షలు అందుకున్నాడు.

ఫైనల్‌లో అజింక్యా రహానే ఎలక్ట్రిక్ స్ట్రైకర్‌కు రూ.1 లక్ష లభించింది. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఫైనల్ సాయి సుదర్శన్ (1 లక్ష), మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ సాయి సుదర్శన్ (1 లక్ష) అందుకున్నాడు. ఇతర అత్యంత విలువైన ఆటగాడు శుభ్‌మన్ గిల్ (12 లక్షలు), ఫెయిర్ ప్లే అవార్డు - ఢిల్లీ క్యాపిటల్స్, ఎమర్జింగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ (20 లక్షలు), ఈ ఎడిషన్‌లో బెస్ట్ క్యాచ్ అవార్డు రషీద్ ఖాన్ (10 లక్షలు) అందుకున్నారు. అంటెయ్ సూపర్ స్ట్రైకర్ అవార్డు గ్లెన్ మాక్స్‌వెల్ (10 లక్షలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డెవాన్ కాన్వే (1 లక్ష) అందుకున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ (12 లక్షలు) అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.

ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠగా సాగింది. గుజరాత్ బ్యాటింగ్ తర్వాత వరుణుడు దోబూచులాడాడు. గుజరాత్ జట్టు మెుదట బ్యాటింగ్ చేసి.. 214 పరుగులు చేసింది. ఇక చెన్నై జట్టు భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. మెుత్తం మ్యాచ్ లో చివరి ఓవర్లో ఉత్కంఠ నెలకొంది. చివ‌రి ఓవ‌ర్‌లో ప‌ద‌మూడు ప‌రుగులు అవ‌స‌రం కాగా తొలి నాలుగు బంతుల‌కు మోహిత్ మూడు ప‌రుగులు మాత్రమే ఇవ్వడంతో గుజ‌రాత్ గెలుపు ఖాయంగా క‌నిపించింది. ఐదో బంతికి సిక్స్‌, ఆరో బాల్‌కు ఫోర్ కొట్టి చెన్నై అభిమానుల్లో జ‌డేజా ఆనందాన్ని నింపాడు. జ‌డేజా ఆరు బాల్స్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 15 ర‌న్స్ చేయ‌గా, శివ‌మ్ దూబే 21 బాల్స్‌లో రెండు సిక్సర్లతో 32 ర‌న్స్‌తో నాటౌట్‌గా మిగిలాడు.

WhatsApp channel