Nitu Ghanghas won Gold: తొలి పంచ్ అదిరింది.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతూకు స్వర్ణం-nitu ghangas hands india first gold at world boxing championships 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nitu Ghanghas Won Gold: తొలి పంచ్ అదిరింది.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతూకు స్వర్ణం

Nitu Ghanghas won Gold: తొలి పంచ్ అదిరింది.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతూకు స్వర్ణం

Maragani Govardhan HT Telugu
Mar 25, 2023 07:13 PM IST

Nitu Ghanghas won Gold: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ నీతూ గాంగాస్ స్వర్ణం గెలిచింది. 48 కేజీల విభాగంలో మంగోలియన్ ప్లేయర్‌పై పైచేయి సాధించి పసిడి కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించింది.

నీతూ గాంగాస్‌కు స్వర్ణం
నీతూ గాంగాస్‌కు స్వర్ణం (BFI)

Nitu Ghanghas won Gold: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో (Women World Boxing Championships ) భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో నీతూ గాంగాస్(Nitu Ghanghas) తొలి స్వర్ణాన్ని అందించింది. న్యూదిల్లీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌ను ఓడించి పసిడి కైవసం చేసుకుంది. 48 కేజీల విభాగంలో నీతూ ఈ ఘనత సాధించింది. రెండు సార్లు యూత్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ యువ బాక్సర్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది.

ఓపెనింగ్ రౌండులో అటాకింగ్‌తో ఆట ప్రారంభించిన నీతూ. తొలి మూడు నిమిషాల్లో పైచేయి సాధించింది. దీంతో ఐదుగురు జడ్జీలు ఆమెకు అనుకూలంగా బౌట్‌ను ప్రకటించారు. రెండో రౌండులో మంగోలియన్‌ బాక్సర్ బలంగా ప్రతిదాడి చేసింది. ఫలితంగా భారత బాక్సర్ కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అలాగే తన డిఫెన్స్‌తో కూల్‌గా ఆడి రౌండును 3-2తో గెలుచుకుంది.

అఖరి రౌండులో నీతూ ఎల్లో కార్డ్‌ను అందుకుంది. అయితే ప్రత్యర్థికి కూడా అదే ఎల్లో కార్డు వచ్చింది. 22 ఏళ్ల ఈ యువ బాక్సర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‍‌లో రెండో సారి పోటీ పడింది. అంతకుముందు రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్(RSC) జడ్జ్మెంట్ ద్వారా మూడు విజయాలు నమోదు చేయగా. గతేడాది మాత్రం సెమీస్‌కే పరిమితమైంది.

వుమెన్స్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణణ సాధించిన ఆరో భారతీయ మహిళగా నీతూ రికార్డు సృష్టించింది. ఆమె కంటే ముందు మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీఆర్ఎల్, లేఖా కేసి, నిఖత్ జరీన్ ఈ టోర్నీలో స్వర్ణాలు సాధించారు. సెమీ ఫైనల్‌లో కజకిస్థాన్ ప్లేయర్ అలువా బల్కిబేకోవాను ఓడించిన నీతూ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో మంగోలియన్ బాక్సర్‌కు తన పంచ్ పవర్ చూపింది.

Whats_app_banner

టాపిక్