తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shreyas Iyer Ruled Out: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం

Shreyas Iyer Ruled Out: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం

Hari Prasad S HT Telugu

14 March 2023, 18:28 IST

    • Shreyas Iyer Ruled Out: టీమిండియాకు షాక్ తగిలింది. వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. గాయం కారణంగా నాలుగోటెస్టులోనూ అతడు బ్యాటింగ్ చేయని విషయం తెలిసిందే.
శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ (PTI)

శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Ruled Out: ఊహించినట్లే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. అతనికి వెన్ను గాయమైన విషయం తెలిసిందే. దీంతో అహ్మదాబాద్ టెస్టు మధ్యలోనే టీమ్ ను వదిలాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉండటంతో అతడు వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఆ తర్వాతే అతడు ఐపీఎల్లో ఆడతాడా లేదా అనేది నిర్ణయించనున్నారు. ఒకవేళ శ్రేయస్ ఆడలేకపోతే మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ కు పెద్ద దెబ్బ పడినట్లే. ఆ జట్టుకు అతడు కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. శ్రేయస్ ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీకి రీహ్యాబిలిటేషన్ కోసం వెళ్లనున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో శ్రేయస్ బ్యాటింగ్ చేయలేదు.

టెస్టు ముగియక ముందే అతడు అహ్మదాబాద్ నుంచి వెళ్లిపోయాడు. తొలి రెండు రోజులు ఫీల్డింగ్ చేసిన అయ్యర్.. తన వెన్ను కింది భాగంలో వాపు వచ్చిందని, నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో అయ్యర్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగానే జడేజా, భరత్ అతని కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చినప్పుడే ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.

నిజానికి రెండో రోజు తనకు బ్యాటింగ్ వస్తుందని రోజంతా శ్రేయస్ ఎదురు చూశాడని, కానీ తీరా బ్యాటింగ్ కు దిగాల్సిన సమయంలో గాయంతో రాలేకపోయాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. నిజానికి ఈ వెన్ను గాయం కారణంగానే అయ్యర్.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తో పాటు ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు వన్డే సిరీస్ కు కూడా దూరం కావడంతో అతని స్థానంలో రజత్ పటీదార్ కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.