తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Rr Vs Rcb Faf Du Plessis Record In Ipl

IPL Records : ఐపీఎల్‌లో ఫాఫ్ డుప్లెసిస్ ప్రత్యేక రికార్డు

Anand Sai HT Telugu

14 May 2023, 18:08 IST

    • IPL 2023 Records : ఐపీఎల్ 60వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి పేరు మీద ప్రత్యేక రికార్డు లిఖించుకున్నాడు.
ఫాఫ్ డుప్లెసిస్ ప్రత్యేక రికార్డు
ఫాఫ్ డుప్లెసిస్ ప్రత్యేక రికార్డు (RCB)

ఫాఫ్ డుప్లెసిస్ ప్రత్యేక రికార్డు

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ ఓ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ 21 పరుగుల చేసిన తర్వాత.. ఐపీఎల్‌లో 4 వేల పరుగులు పూర్తి చేశాడు. దీని ద్వారా ఐపీఎల్ చరిత్రలో 4 వేలకు పైగా పరుగులు చేసిన 14వ ఆటగాడిగా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అంతే కాకుండా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన 4వ విదేశీ ఆటగాడిగా కూడా డుప్లెసిస్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 4000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.

డేవిడ్ వార్నర్ : ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. వార్నర్ 174 ఇన్నింగ్స్‌ల్లో 6265 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఏబీ డివిలియర్స్ : ఐపీఎల్‌లో మొత్తం 170 ఇన్నింగ్స్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ మొత్తం 5162 పరుగులు సాధించి ఈ జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

క్రిస్ గేల్ : క్రిస్ గేల్ 141 ఇన్నింగ్స్‌లలో మొత్తం 4965 పరుగులతో ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు.

ఫాఫ్ డుప్లెసిస్ : 121 ఇన్నింగ్స్‌లు ఆడిన ఫాఫ్ డుప్లెసిస్ మొత్తం 4020 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 4 వేలకు పైగా పరుగులు చేసిన 4వ విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

అంతకు ముందు కూడా.. రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా డుప్లెసిస్ మరో రికార్డును కూడా లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 23 నాడు జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో పాట్నర్‌షిప్‌తో అదరగొట్టారు. 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్‌లో డుప్లెసిస్(62), మ్యాక్సీ(77) ఆ రికార్డును బ్రేక్ చేశారు. తర్వాత తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టారు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్‌ హిస్టరీలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. మూడో వికెట్‌కు మాత్రం ఇదే అత్యుత్తమం.