Suryakumar Yadav Records: ఐపీఎల్‌లో ఫస్ట్ సెంచరీతో సూర్యకుమార్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే
Suryakumar Yadav Records: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన ముంబై బ్యాట్స్‌మెన్స్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఏవంటే...
Suryakumar Yadav Records: గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు సూర్యకుమార్ యాదవ్. 49 బాల్స్‌లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 103 రన్స్ చేశాడు. సూర్యకుమార్ సెంచరీతో ఇరవై ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయాన్ని సాధించింది. ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ సెంచరీతో ఐపీఎల్‌లో పలు రికార్డులను సూర్యకుమార్ బ్రేక్ చేశాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. ఈ జాబితాలో సనత్ జయసూర్య (114 రన్స్), రోహిత్ శర్మ (109 రన్స్) టాప్ టూ ప్లేస్‌లో ఉన్నారు. వారి తర్వాత స్థానంలో సూర్యకుమార్ నిలిచాడు. అంతే కాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా సూర్యకుమార్ మరో రికార్డ్ నెలకొల్పాడు. గుజరాత్ టైటాన్స్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ అతడే.
ఐపీఎల్‌లో ఏ జట్టుపైనైనా ముంబై ఇండియన్స్‌కు ఇదే హయ్యెస్ట్ టోటల్ కావడం గమనార్హం. అంతే కాకుండా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసిన మూడో ప్లేయర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున 2416 రన్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.
రషీద్ ఖాన్ సిక్సర్ల రికార్డ్…
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు రషీద్‌ఖాన్ కూడా ఈ మ్యాచ్ లో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. గుజరాత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు (పది సిక్సర్లు) కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో శుభ్‌మన్ గిల్ ( ఆరు సిక్సర్లు) పేరిట ఈ రికార్డ్ ఉంది. అతడి రికార్డును ముంబై మ్యాచ్ ద్వారా రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు.
ముంబై ఇండియన్స్‌పై ఛేజింగ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్‌గా రషీద్‌ఖాన్ మరో రికార్డ్ నెలకొల్పాడు. అలాగే ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రషీద్ ఖాన్, అల్జరీ జోసెఫ్ నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్‌కు వీరిద్దరి 88 పరుగులు చేశారు.