తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Playoffs: 8 మ్యాచ్‌లు.. ఏడు జట్లు.. ముగ్గురికే ఛాన్స్.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?

IPL 2023 Playoffs: 8 మ్యాచ్‌లు.. ఏడు జట్లు.. ముగ్గురికే ఛాన్స్.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?

Hari Prasad S HT Telugu

16 May 2023, 14:24 IST

    • IPL 2023 Playoffs: 8 మ్యాచ్‌లు.. ఏడు జట్లు.. ముగ్గురికే ఛాన్స్.. మరి ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు? ఒకసారి రేసులో ఉన్న టీమ్స్ లో ఎవరికి ఎలాంటి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం.
ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు
ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు

ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు

IPL 2023 Playoffs: ఐపీఎల్ 2023లో కేవలం 8 లీగ్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటన్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటికెళ్లిపోయాయి. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. మిగిలిన 8 మ్యాచ్ లలోనే ఈ మూడు టీమ్స్ ఏవో తేలిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఛాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

చెన్నై సూపర్ కింగ్స్

మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడి 7 గెలిచింది. ఐదు ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. 15 పాయింట్లు, 0.381 నెట్ రన్‌రేట్ తో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. డీసీతో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. అయితే టాప్ 2లో ఉంటుందా అన్నది మాత్రం మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.

ఇక చివరి మ్యాచ్ ఓడిపోతే సీఎస్కే ఇంటిదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. మరో ఐదు జట్లు 15 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే వీలు ఉండటమే దీనికి కారణం. అయినా అన్ని మ్యాచ్ ల ఫలితాలు సీఎస్కేకు అనుకూలంగా వస్తే.. ఆ టీమ్ చివరి మ్యాచ్ లో ఓడినా క్వాలిఫై అవుతుంది.

ముంబై ఇండియన్స్

12 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు గెలిచి, ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లు, -0.117 నెట్ రన్ రేట్‌తో ఆ టీమ్ మూడోస్థానంలో ఉంది. లక్నో, హైదరాబాద్ లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే టాప్ 2లో ముంబై క్వాలిఫై అవుతుంది.

ఒకటి గెలిచి, మరొకటి ఓడితే 16 పాయింట్లతో మిగతా టీమ్స్ గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడితే కష్టమే. అప్పటికీ అవకాశం ఉన్నా.. నాలుగోస్థానం కోసం మరో మూడు టీమ్స్ తో పోటీ ఉంటుంది.

లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్ జెయింట్స్ 12 ఆడి 6 గెలిచి, ఐదు ఓడిపోయింది. ఒకటి ఫలితం తేలలేదు. 13 పాయింట్లు, 0.309 నెట్ రన్‌రేట్ తో నాలుగోస్థానంలో ఉంది. ముంబై, కేకేఆర్‌తో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకటి గెలిచి, మరొకటి ఓడితే నెట్ రన్‌రేట్ తో సంబంధం లేకుండా మిగతా ఫలితాలు లక్నోకు అనుకూలంగా వస్తే అర్హత సాధిస్తుంది. రెండూ ఓడితే మాత్రం ఇంటికెళ్లిపోవాల్సిందే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆర్సీబీ 12 ఆడి, ఆరు గెలిచి, మరో ఆరు ఓడింది. 12 పాయింట్లు, 0.166 నెట్ ‌రన్‌రేట్ తో ఐదో స్థానంలో ఉంది. సన్ రైజర్స్, జీటీతో మ్యాచ్ లు ఉన్నాయి. ఆర్ఆర్ పై భారీ విజయం ఆర్సీబీ అవకాశాలను మెరుగుపరిచింది.

నెట్ రన్‌రేట్ పాజిటివ్ గా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లతో ఆ టీమ్ అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి. ఒకటి గెలిచి మరొకటి ఓడితే మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిందే.

రాజస్థాన్ రాయల్స్

గతేడాది రన్నరప్స్ రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి, ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లు, 0.140 నెట్ రన్‌రేట్ తో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఆర్సీబీ చేతుల్లో దారుణమైన ఓటమి ఆర్ఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.

చివరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిందే. అప్పటికీ మిగతా మ్యాచ్ ల ఫలితాలను బట్టే ఆర్ఆర్ క్వాలిఫై అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆర్సీబీ, లక్నో తమ చివరి రెండు మ్యాచ్ లు ఓడటంతోపాటు సన్ రైజర్స్ తమ చివరి మ్యాచ్ లో ముంబై చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితేనే ఆర్ఆర్ చివరి మ్యాచ్ గెలిస్తే అర్హత సాధిస్తుంది. ఇక ఓడితే మాత్రం ఇంటికే.

పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ 12 ఆడి ఆరు గెలిచి, ఆరు ఓడింది. 12 పాయింట్లు, -0.288 నెట రన్‌రేట్ తో ఏడో స్థానంలో ఉంది. డీసీ, ఆర్ఆర్ లతో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.

అయితే నెట్ రన్‌రేట్ నెగటివ్ గా ఉండటంతో భారీ విజయాలు సాధించడంతోపాటు ఇతర జట్ల నుంచి కూడా సాయం అందాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి ఓడినా నాలుగోస్థానం కోసం మరో నాలుగు టీమ్స్ తో పోటీ పడాల్సి వస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్ లనూ పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో ఆడనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్

కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి, ఏడు ఓడింది. 12 పాయింట్లు, -0.256 నెట్ రన్‌రేట్ తో 8వ స్థానంలో ఉంది. లక్నోతో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే టాప్ 4లో ముగించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి.

లక్నో మిగిలిన రెండు మ్యాచ్ లు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కనీసం ఒక్కో మ్యాచ్ లో ఓడాల్సి ఉంటుంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ కూడా నెగటివ్ గా ఉండటంతో ఆ టీమ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువే అని చెప్పాలి.