తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 : ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోరు చేసిన జట్లు ఏవో మీకు తెలుసా?

IPL 2023 : ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోరు చేసిన జట్లు ఏవో మీకు తెలుసా?

Anand Sai HT Telugu

15 May 2023, 7:27 IST

    • IPL 2023 : ఐపీఎల్ 60వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును బెంగళూరు అత్యల్ప స్కోరుకే ఆలౌట్ చేసింది. ఇలాంటి చెత్త రికార్డు మరికొన్ని జట్ల మీద ఉంది. అవేంటో ఒకసారి చూడండి.
ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్
ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ (RCB Twitter)

ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరుకు ఔట్ అయిన చెత్త రికార్డును కలిగి ఉంది. కానీ మరో జట్టును తక్కువ మొత్తానికి ఆలౌట్ చేసిన రికార్డు కూడా ఆర్సీబీ జట్టు పేరిట ఉంది. అవును, IPLలో RCB కాకుండా ఇతర జట్టును అతి తక్కువ మొత్తానికి ఔట్ చేసిన రికార్డును బెంగళూరు కలిగి ఉంది. 2 సార్లు ఆర్సీబీ జట్టు(RCB Team) మరో జట్టును 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ మొత్తంలో ఔట్ అయిన జట్లు ఏవో చూద్దాం...

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 2017లో KKRపై RCB కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇదే.

రాజస్థాన్ రాయల్స్ : 2009లో రాజస్థాన్ రాయల్స్ RCB చేతిలో కేవలం 58 పరుగులకే ఆలౌటైంది. ఇది 2వ అత్యల్ప స్కోరు.

రాజస్థాన్ రాయల్స్ : 2023లో RCB రాజస్థాన్ రాయల్స్‌ను 60 కంటే తక్కువ పరుగులకే కట్టడి చేసింది. జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆర్‌సీబీ 59 పరుగులకే కట్టడి చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ : 2017లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేవలం 66 పరుగులకే కట్టడి చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ : 2017లోనే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ : 2008లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.

ఇక ఐపీఎల్ 60వ మ్యాచ్ లో కేవలం 59 పరుగులకే రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు ఆలౌట్ అయింది. ప్లే ఆఫ్స్ ఆసలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగి ఆడారు. దీంతో రాజస్థాన్ జట్టుపై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. మెుదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 59 పరుగులకే ఆలౌటైంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్‌ జరిగింది.