IPL 2022 Final | టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. టైటిల్ గెలిచేదెవరో?
ఐపీఎల్ ఫైనల్‌లో భాగంగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటిల్‌పై కన్నేయగా.. రాజస్థాన్ రెండోసారి టైటిల్ గెలిచి షేన్ వార్న్‌కు అసలైన నివాళి అర్పించాలని అనుకుంటోంది.
<p>ఫైనల్ టాస్ సందర్భంగా హార్దిక్, సంజు</p> (Hotstar)
అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కూడా రెండో క్వాలిఫయర్ ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు శాంసన్ చెప్పాడు. అటు హోమ్ గ్రౌండ్‌లో తొలిసారి ఆడుతున్న గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడటానికి రాగానే స్టేడియం మార్మోగిపోయింది.
ఈ మ్యాచ్‌కు గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ వచ్చినట్లు పాండ్యా చెప్పాడు. టాస్ గెలిస్తే తాము బౌలింగ్ ఎంచుకోవాలని భావించినట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్ 2022లో ఈ టీమ్స్ రెండుసార్లు తలపడగా.. గుజరాతే గెలిచింది. లీగ్ స్టేజ్‌లో ఒకసారి, క్వాలిఫయర్ 1లో మరోసారి రాజస్థాన్‌ను గుజరాత్ చిత్తు చేసింది.