RCB Players Visits Siraj Home:సిరాజ్ కొత్త ఇంట్లో ఆర్‌సీబీ ప్లేయర్స్ సందడి - వీడియో వైరల్
RCB Players Visits Siraj Home: పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లో కట్టుకున్న కొత్త ఇంట్లో ఆర్‌సీబీ ప్లేయర్స్ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RCB Players Visits Siraj Home: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ హైదరాబాద్‌లో సందడి చేశారు. పేసర్ మహ్మద్ సిరాజ్ కొంత ఇంటిని సందర్శించారు. మే 18న (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఉప్పల్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల ముందుగానే బెంగళూరు ప్లేయర్స్ హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్‌సీబీ ప్లేయర్స్ హైదరాబాద్‌లోని మహ్మద్ సిరాజ్ ఇంటిలో సందడి చేశారు.
ఇటీవలే ఫిల్మ్ నగర్‌లో కొత్త ఇంటిని కట్టుకున్నాడు సిరాజ్. తన కొత్త ఇంటికి విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆర్‌సీబీ ప్లేయర్స్‌ను సిరాజ్ ఆహ్వానించినట్లు తెలిసింది. సిరాజ్ ఆహ్వానం మేరకు కోహ్లితో పాటు డుప్లెసిస్ అతడి ఇంటిని సందర్శించారు.
ఈ వీడియోలో కోహ్లి, డుప్లెసిస్‌తో పాటు కేదార్ జాదవ్, పార్నెల్‌తో పాటు కొందరు ఆర్‌సీబీ ప్లేయర్స్ కనిపిస్తోన్నారు. సిరాజ్ ఇంటిని ఆర్‌సీబీ ప్లేయర్స్ సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోహ్లికి సిరాజ్‌కు మధ్య చక్కటిఅనుబంధం ఉంది. చాలా ఏళ్లుగా విరాట్‌తో పాటు సిరాజ్ కూడా బెంగళూరు టీమ్‌లోనే కొనసాగుతోన్నాడు. ఆ అనుబంధంతోనే సిరాజ్ ఇంటికి కోహ్లి వచ్చినట్లు చెబుతోన్నారు. 2018 ఏడాది కూడా ఆర్‌సీబీ ప్లేయర్స్ కు తన ఇంట్లో పార్టీ ఇచ్చాడు సిరాజ్.
కాగా ప్రస్తుతం 12 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది బెంగళూరు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే భారీ ఆధిక్యంతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించేందుకు ఆర్‌సీబీ ప్రణాళికలు రచిస్తోంది.