తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Brett Lee On Team India : టీమిండియాకు బ్రెట్ లీ వార్నింగ్

Brett Lee On Team India : టీమిండియాకు బ్రెట్ లీ వార్నింగ్

HT Telugu Desk HT Telugu

21 February 2023, 12:01 IST

    • India Vs Australia 3rd Test : ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ టీమిండియాను హెచ్చరించాడు. ఆస్ట్రేలియా కొత్త స్పిన్నర్ టాడ్ మర్ఫీ మూడో టెస్టులో భారత్‌కు ఇబ్బందులు తెస్తాడని బ్రెట్ లీ అన్నాడు.
బ్రెట్ లీ
బ్రెట్ లీ

బ్రెట్ లీ

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) టెస్ట్ సిరీస్ రెండు మ్యాచ్‌లు ముగిశాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా(Team India) గెలిచింది. ఇప్పుడు ఇరు జట్లు మూడో టెస్టు మ్యాచ్‌కి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ(Brett Lee) టీమిండియాను హెచ్చరించాడు. ఆస్ట్రేలియా కొత్త స్పిన్నర్ టాడ్ మర్ఫీ(Todd Murphy) మూడో టెస్టులో భారత్‌కు ముల్లులా మారుతాడని బ్రెట్ లీ అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీని గురించి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో లీ మాట్లాడుతూ, 'నాథన్ లాన్ తర్వాత, ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ ఎవరు అనేదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు సమాధానం దొరికింది. అతను 22 ఏళ్ల సూపర్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ. అతనిది అద్భుతమైన అరంగేట్రం. ఆస్ట్రేలియా(Australia) ఓడిపోయి ఉండవచ్చు. అయితే, క్రికెట్ ప్రపంచం మర్ఫీ ఆటతీరును మెచ్చుకుంది.' అని లీ అన్నాడు.

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో మర్ఫీ టెస్టు క్రికెట్‌(Cricket)లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో 7 వికెట్లు తీశాడు. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్(Kl Rahul), ఆర్.అశ్విన్ వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో టాడ్ మర్ఫీ 7 వికెట్లు తీశాడు. నిజానికి ఇది మర్ఫీకి చిరస్మరణీయమైన అరంగేట్రం. మరో ప్రత్యేకత ఏమిటంటే, మర్ఫీ తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఘనత సాధించాడు.

నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు(First Test)లో భారత్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అనంతరం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టెస్టు మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌లలో కనిపించిన ఆటగాళ్లను మిగిలిన మ్యాచ్‌లకు ఎంపిక చేస్తారు. అయితే వైస్ కెప్టెన్ ఎవరన్నది మాత్రం బీసీసీఐ(BCCI) వెల్లడించలేదు. రోహిత్ శర్మ(Rohit Sharma)కే నిర్ణయించే అధికారాన్ని సెలక్షన్ కమిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2వ టెస్టు నుంచి తొలగించబడిన జయదేవ్ ఉనద్కత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు.

భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ , మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.