KL Rahul Spot under threat: కేఎల్ రాహుల్ ప్రదర్శనపై విమర్శలు.. స్థానంపై సందేహాలు-batting coach vikram rathour says kl rahul to come good ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Spot Under Threat: కేఎల్ రాహుల్ ప్రదర్శనపై విమర్శలు.. స్థానంపై సందేహాలు

KL Rahul Spot under threat: కేఎల్ రాహుల్ ప్రదర్శనపై విమర్శలు.. స్థానంపై సందేహాలు

Maragani Govardhan HT Telugu
Feb 11, 2023 08:31 AM IST

KL Rahul Spot under threat: కేఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడి స్థానంలో మరొకరికి అవకాశమివ్వాలని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ గత గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు.

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (ANI )

KL Rahul Spot under threat: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన ఆ ఆటగాడు.. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు. నాగపుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇతడు విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తే మంచిదని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పందించారు. రాహుల్ గత గణాంకాలను చూసి మాట్లాడాలని స్పష్టం చేశారు.

"కేఎల్ రాహుల్‌ తరఫున కాస్త సహనంగ వ్యవహరించండి. అతడు ఆడిన గత 10 టెస్టు ఇన్నింగ్స్ చూసుకుంటే రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుల్లో సెంచరీలు నమోదు చేశాడు. బాగా ఆడుతున్న అతడి స్థానం గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు." అని విక్రమ్ రాథోర్ తెలిపారు.

ఇదిలా ఉంటే పలువురు కేఎల్ రాహుల్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడు తన స్థాయికి తగినట్లుగా ఆడట్లేదని, పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడని అంటున్నారు. ఇటీవల భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఇదే విషయాన్ని తెలిపాడు.

"కేఎల్ రాహుల్ నిరాశ పరుస్తున్నాడు. అతడు కొంచెం టైమ్ తీసుకోవాలి. అతడు దూకుుడుగా ఆడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఫలితంగా ఎక్కువ పరుగులు చేయగలడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడి బ్యాటింగ్ చేసే అవకాశమొస్తే ఆత్మవిశ్వాసంతో పరుగులు చేస్తాడని భావిస్తున్నా." అని హర్భజన్ అన్నాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే కుప్పుకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్‌తో ఆదిలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు పూర్తయ్యే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(120) శతకంతో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా(66), అక్షర్ పటేల్(52) అద్భుత అర్ధశతకాలతో రాణించారు.

WhatsApp channel

సంబంధిత కథనం