IND vs AUS 2nd Test: జడేజాకు ఏడు వికెట్లు - సెకండ్ ఇన్నింగ్స్‌లో 113 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్
IND vs AUS 2nd Test: స్పిన్నర్లు అశ్విన్, జడేజా ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. సెకండ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకు ఆలౌటైంది. ఇండియా ముందు 115 పరుగుల టార్గెట్‌ను విధించింది
IND vs AUS 2nd Test: సెకండ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కుప్పకూలింది. టీమ్ ఇండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా ధాటికి 113 పరుగులకు ఆలౌటైంది. ఒక వికెట్ నష్టానికి 61 పరుగులతో మూడో రోజును ప్రారంభించిన ఆస్ట్రేలియాను అశ్విన్, జడేజా కలిసి దెబ్బకొట్టారు.
వీరిద్దరి బౌలింగ్ మెరుపులతో కేవలం 52 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (43 రన్స్), లబుషేన్ (35 రన్స్) నిలదొక్కుకున్నట్లుగానే కనిపించారు. హెడ్‌ను అశ్విన్, లబుషేన్‌ను జడేజా ఔట్ చేయడంలో ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది.
మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జడేజా ఏడు వికెట్లు తీసుకోగా అశ్విన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కేవలం 31 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.