తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Bcci: సెలక్షన్‌ కమిటీలో మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌నూ పెట్టుకోండి.. బీసీసీఐపై గవాస్కర్‌ సెటైర్‌

Gavaskar on BCCI: సెలక్షన్‌ కమిటీలో మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌నూ పెట్టుకోండి.. బీసీసీఐపై గవాస్కర్‌ సెటైర్‌

Hari Prasad S HT Telugu

09 January 2023, 14:23 IST

    • Gavaskar on BCCI: సెలక్షన్‌ కమిటీలో మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌నూ పెట్టుకోండి అంటూ బీసీసీఐపై సెటైర్‌ వేశాడు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌. ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి యో యో టెస్ట్‌ నిర్వహించాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
గవాస్కర్, బీసీసీఐ
గవాస్కర్, బీసీసీఐ

గవాస్కర్, బీసీసీఐ

Gavaskar on BCCI: ఈ మధ్య కాలంలో ఇండియన్‌ క్రికెట్‌లో తరచూ గాయాల కారణంగా టీమ్‌కు దూరమవుతున్న ప్లేయర్స్‌ సంఖ్య పెరిగిపోతోంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌కు ఇలాగే బుమ్రా, జడేజాలాంటి ప్లేయర్స్‌ దూరమవడం ఇండియా విజయావకాశాలపై ప్రభావం చూపింది. టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ వరల్డకప్‌ వైఫల్యంపై చాలా రోజుల తర్వాత ఈ మధ్యే బీసీసీఐ ఓ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. అందులో ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా యో యో టెస్ట్‌ను మరోసారి తప్పనిసరి చేసింది. దీనికితోడు డెక్సా స్కాన్‌నూ తీసుకొచ్చింది. అయితే ఈ యో యో టెస్ట్‌ను మరోసారి తీసుకురావడంపై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలక్షన్‌ కమిటీలో మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ పెట్టుకోండంటూ బోర్డుపై సెటైర్‌ వేశాడు.

"నేను చెప్పేది ఏంటంటే.. ఫిట్‌నెస్‌ అనేది వ్యక్తిగత విషయం. అందరికీ ఒకే రకంగా ఉండాలనుకోవడం సరి కాదు. స్పిన్నర్లతో పోలిస్తే ఫాస్ట్‌ బౌలర్లకు ఫిట్‌నెస్‌ వేరుగా ఉండాలి. బ్యాటర్లతో పోలిస్తే వికెట్‌ కీపర్లు మరికాస్త ఎక్కువ ఫిట్‌గా ఉండాలి. ప్లేయర్ ప్రత్యేకతను బట్టి కాకుండా అందరికీ కలిపి ఒకే ప్రమాణాన్ని సెట్‌ చేయడం న్యాయం కాదు" అని మిడ్‌ డేకు రాసిన కాలమ్‌లో గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

"క్రికెట్‌ ఫిట్‌నెస్‌ అనేది ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు ఈ ఫిట్‌నెస్‌ టెస్టులను అందరి ముందూ నిర్వహించాలి. అప్పుడే ఏ ప్లేయర్‌ ఫిట్‌గా ఉన్నాడో ఎవరు లేరో తెలుస్తుంది. ఈ మధ్యే క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ సెలక్షన్‌ కమిటీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో ఒక్కరు కూడా బయో మెకానిక్స్‌ ఎక్స్‌పర్ట్‌ లేదంటే బాడీ సైన్స్‌ తెలిసిన వ్యక్తి లేడు. ప్లేయర్‌ ఫిట్‌నెస్సే అర్హత అయినప్పుడు ఇలాంటి ఎక్స్‌పర్ట్స్‌ కూడా సెలక్షన్‌ కమిటీలో ఉండాలి" అని గవాస్కర్‌ తన కాలమ్‌లో రాశాడు.

ఒకవేళ ఒక స్థానం కోసం ఇద్దరు ప్లేయర్స్‌ ఉన్నప్పుడు వాళ్లలో ఎవరిని తీసుకోవాలో ఈ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతారంటూ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. "టీమ్‌లో ఒక స్థానం కోసం ఇద్దరు ప్లేయర్స్‌ పోటీలో ఉన్నారనుకోండి. వాళ్లలో ఎవరు ఫిట్‌గా ఉన్నారో ఈ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతారు. వాళ్లు చేసిన పరుగులు, తీసిన వికెట్లతో ఇక్కడ సంబంధం లేదు కదా మరి" అని గవాస్కర్‌ కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.