తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci Selection Committee Chairman: మరోసారి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా చేతన్ శర్మ.. ప్యానెల్‌లో ఎవరెవరున్నారంటే?

BCCI Selection Committee Chairman: మరోసారి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా చేతన్ శర్మ.. ప్యానెల్‌లో ఎవరెవరున్నారంటే?

07 January 2023, 17:55 IST

    • BCCI Selection Committee Chairman: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా చేతన్ శర్మనే కొనసాగనున్నారు. ఈ మేరకు తన ప్రకటనను విడుదల చేసింది బీసీసీఐ. చేతన్ శర్మతో పాటు మరో నలుగురు కమిటీ సభ్యులను ఎంపిక చేసింది.
చేతన్ శర్మ
చేతన్ శర్మ (Twitter)

చేతన్ శర్మ

BCCI Selection Committee Chairman: టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ గత రెండేళ్లుగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 2020 నుంచి గతేడాది చివరి వరకు ఆయన కొససాగారు. తాజాగా మరోసారి చేతన్ శర్మనే ఛీఫ్ సెలక్టర్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు శనివారం నాడు బీసీసీఐ తన ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఇతర జోనల్ సెలక్టర్ల ప్యానెల్‌ను కూడా ప్రకటించింది. ప్యానెల్‌లో సౌత్ జోన్‌కు శ్రీధరన్ శరత్, సెంట్రల్ జోన్‌కు శివ్ సుందర్ దాస్, తూర్పు జోన్‌కు సుబ్రతో బెనర్జీ, వెస్ట్ జోన్‌కు సలీల్ అంకోలాను నియమిస్తున్నట్లు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఎంఎస్ సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమీటీ(CAC) ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులను ఎంపికను చేపట్టింది. 2022 నవంబరు 18న బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేసిన ఐదు పోస్టులకు ప్రకటన జారీ చేసింది. ఫలితంగా 600 దరఖాస్తులు వచ్చాయి." అని బీసీసీఐ ప్రకనటలో పేర్కొంది.

ఈ దరఖాస్తుల నుంచి 11 మందిని షార్ట్ లిస్టు చేసినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

"దీంతో తగిన చర్చలు, పరిశీలనల తర్వాత సీఏసీ వ్యక్తిగత ఇంటర్వ్యూలో కోసం 11 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఇంటర్వ్యూల ఆధారంగా సీనియర్ పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీకి చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌ను ఎంపిక చేసింది." అని బీసీసీఐ తన స్టేట్మెంటులో పేర్కొంది. ఈ కమిటీకి చేతన్ శర్మను ఛైర్మన్‌గా సిఫార్సు చేసింది.

నవంబరులో సెలక్షన్ కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ఇందుకోసం నవంబరు 28వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. ఈ పోస్టులకు అప్లయి చేయాలనుకున్నవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాలని శరతు విధించింది. అంతేకాకుండా అభ్యర్థులు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలని పేర్కొంది.

గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓడిపోవడంతో సెలక్షన్ కమిటీని ప్రక్షాలన చేసి కొత్త సెలక్టర్ల ఎంపికను చేపట్టింది బీసీసీఐ. ఇందుకోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజాగా చేతన్ శర్మ ఎంపికతో కొత్త సవాళ్లను ఎదుర్కోనున్నారు. 2023 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ ఇందులో ముఖ్యమైంది.

టాపిక్