తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishab Pant Health Update: రిషబ్ పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతం.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

Rishab Pant Health Update: రిషబ్ పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతం.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

07 January 2023, 15:32 IST

    • Rishab Pant Health Update: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోకాలి సర్జరీ విజయవంతమైంది. ముంబయిలోని కొకిలా బెన్ ఆసుపత్రి అతడి మోకాలి స్నాయువు(Nee Ligament)కు శస్త్రచికిత్స జరిగింది.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ (AP)

రిషబ్ పంత్

Rishab Pant Health Update: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని రెండు రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం ముంబయికి తీసుకొచ్చారు. ముంబయి కొకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రిలో అతడికి వైద్యం అందిస్తున్నారు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా అతడి మోకాలికి విజయవతంగా శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"రిషబ్ పంత్‌కు శుక్రవారం మోకాలి లిగమెంట్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ఉన్నాడు. తదుపరి చర్య, పునరావసానికి సంబంధించిన డాక్టర్ దిన్,షా పార్దివాలా సలహా మేరకు బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడిసన్ బృందం ఏం చేయాలో అనుసరిస్తుంది." అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసన్ అధినేత డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో పంత్‌కు ఈ సర్జరీ జరిగింది. కమర్షియల్ ఎయిర్‌లైన్ ద్వారా ఎయిర్ ఆంబులెన్స్‌లో పంత్‌ను దెహ్రాదూన్ నుంచి ముంబయికి తరలించారు. డిసెంబరు 30 తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులను చూసేందుకు దిల్లీ నుంచి రూర్కీకి కారులో వెళ్లిన పంత్ ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా రావడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి మంటల చెలరేగాయి. దీంతో పంత్‌కు అక్కడ అక్కడ అనేక గాయాలయ్యాయి.

దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం మోకాలి స్నాయువుకు సర్జరీ జరిగింది. అతడు త్వరగా కొలుకునేందుకు వైద్యులు తమ పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం