BCCI Selection Committee: సెలక్టర్‌ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్న చేతన్‌ శర్మ!-bcci selection committee chetan sharma reapplied for the job ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bcci Selection Committee Chetan Sharma Reapplied For The Job

BCCI Selection Committee: సెలక్టర్‌ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్న చేతన్‌ శర్మ!

Hari Prasad S HT Telugu
Dec 01, 2022 11:28 AM IST

BCCI Selection Committee: సెలక్టర్‌ పదవి కోసం చేతన్‌ శర్మ మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య బీసీసీఐ రద్దు చేసిన సెలక్షన్‌ కమిటీకి అతడే ఛైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

చేతన్ శర్మ
చేతన్ శర్మ

BCCI Selection Committee: సీనియర్‌ టీమ్‌ సెలక్షన్‌ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలుసు కదా. అయితే ఇందులో సెలక్టర్‌ పదవి కోసం మాజీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. అతనితోపాటు గతంలో కమిటీలో ఉన్న హర్విందర్‌ సింగ్‌ కూడా మరోసారి అప్లై చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఓటమిత తర్వాత సెలక్షన్‌ కమిటీని బీసీసీఐ రద్దు చేసి మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది.

ట్రెండింగ్ వార్తలు

టీ20 వరల్డ్‌కప్‌ వరకూ చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ టీమ్‌ ఎంపిక దారుణంగా ఉంది. ప్రతిసారీ వాళ్లు ఎంపిక చేసిన టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీంతో నాలుగేళ్లు కొనసాగాల్సిన కమిటీని రెండేళ్లలోనే బీసీసీఐ రద్దు చేసింది. ఈ కమిటీలో చేతన్‌శర్మ, హర్విందర్‌ సింగ్‌తోపాటు సునీల్‌ జోషి, దేబశిష్ మొహంతీ ఉన్నారు. వీళ్లలో కొందరు 2020లో, మరికొందరు 2021లో నియమితులయ్యారు.

వాళ్ల పనితీరు సరిగా లేకపోవడంతో కనీసం నాలుగేళ్లు ఉండాల్సిన పదవి కాస్తా ఒకటి, రెండేళ్లలోనే పోయింది. ఇప్పుడు తాజాగా మరోసారి దరఖాస్తులు ఆహ్వానించగా.. 60 మంది అప్లై చేసుకున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రిపోర్ట్‌ చేసింది. వీళ్లలో చేతన్‌, హర్విందర్‌ కూడా ఉన్నారు. ఇక సునీల్‌జోషి, మొహంతి మాత్రం తిరిగి దరఖాస్తు చేసుకోలేదు.

సెలక్షన్‌ కమిటీలో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడు టెస్టులు లేదా 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాలన్న నిబంధన ఉంది. ఇక కనీసం ఐదేళ్ల కిందట క్రికెట్‌ నుంచి రిటైరైన వ్యక్తి అయి ఉండాలి. నవంబర్‌ 28కే ఈ దరఖాస్తుల గడువు ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండు కొత్త నిబంధనలు చేర్చారు.

ప్రతి మూడు నెలలకోసారి టీమ్‌ ప్రదర్శనపై రిపోర్ట్‌ను బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు ఇవ్వడం, ప్రతి ఫార్మాట్‌కు ఓ కెప్టెన్‌ను నియమించడం అన్నది ఇందులోని కీలకమైన పాయింట్లు. ఇక టీమ్‌కు సంబంధించి మీడియా అడిగే ప్రశ్నలను సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది కూడా మరో నిబంధన.

WhatsApp channel

టాపిక్