తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు.. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్త

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు.. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్త

11 October 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 11వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

నేటి రాశిఫలితాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (11-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబంలో చికాకులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఉంటాయి. అయినప్పటికి ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఎక్కువ అవుతాయి. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు దుర్గాదేవిని పూజిస్తే మంచిది.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వస్తుంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు.. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగములో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం ఇది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కానీ ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శత్రుత్వ భయము ఉంటుంది. కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శత్రుబాధలు ఎక్కువ అవుతాయి. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి.. కుటుంబంలో గౌరవం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితములు ఉన్నాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. కుటుంబములో సౌఖ్యము, కీర్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తమునుంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మీ కృషి, పట్టుదలతో ముందుకు వెళ్లి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కాస్త కష్ట సమయమే. వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థగా ఉంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారముల్లో జాగ్రత్త వహించండి. ధనవ్యయము, ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు కష్టకాలము. ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్

తదుపరి వ్యాసం