Capricorn Horoscope | మకర రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
మకర రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మకర రాశి గురించి తెలుసుకుందాం.
Ugadi Panchangam | ఉత్తరాషాడ - 2,3,4వ పాదములు, శ్రవణం - 1,2,3,4 పాదములు, ధనిష్ఠ- 1,2 పాదములు
* ఆదాయం - 5
* వ్యయం - 2
* రాజ్యపూజ్యం - 2
* అవమానం - 4
శ్రీ శుభకృత్ నామసంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్థానమందు సంచరించుట, శని 2వ స్థానము, వక్రియై 1వ స్థానమునందు సంచరించుట, రాహువు మాతృ స్థానమగు 4వ స్థానమునందు సంచరించుట, కేతువు 10వ స్థానమునందు సంచరించుట చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితములు ఉన్నవి. మకరరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికి కలిసిరావడం, వ్యాపారము మధ్యస్థ ఫలితాలతో ముందుకు కొనసాగడం వంటివి జరుగును. 4వ ఇంట రాహువు ప్రభావముచేత కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, భేదాభిప్రాయాలు కలుగును.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ సమయంలో శని వక్రియై 2వ స్థానమందు (ఏలినాటి శని) సంచరించుట చేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడును. బృహస్పతి 3వ స్థానములో సంచరించుట చేత కుటుంబమునందు ప్రతికూల ఫలితములు. 3వ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత మకరరాశి వారికి ఈ సంవత్సరం ధన విషయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం మకరరాశి వారికి ఉద్యోగ, వ్యాపారములలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుటుంబమునందు మానసిక ఇబ్బందులు, ఘర్షణలు ఉంటాయి. మకరరాశికి ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగ, ఆరోగ్య, కుటంబ వ్యవహారములందు జాగ్రత్త వహించవలెను.
మకర రాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు అనుకూలంగా లేదు. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య మధ్యస్థ పరిస్థితులుగాను ఉన్నవి. మకరరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయవలెను. వ్యాపారస్తులకు ఇబ్బందులతో కూడినటువంటి కాలం. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితములు ఉన్నవి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సూచనలు ఉన్నవి. మకర రాశి వారు ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. వ్యవసాయదారులకు, సినీరంగం వారికి మధ్యస్థముగా ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలి అనుకుంటే.. ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించండం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించడం, గురువారం దత్తాత్రేయుని పూజించాలి. శనివారం దుర్గాదేవిని పూజించడం మంచిది.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో సంతోషము, చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారములలో అభివృద్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నములు అనుకూలిస్తాయి.
మే - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడులు, గృహమునందు సుఖశాంతులు లేకపోవడం, అనుకోకుండా గొడవలు, సంతృప్తి లేకుండా ఉంటారు.
జూన్ - ఈ మాసం మీకు మధ్యస్థ నుంచి అనుకూల ఫలితాలు ఉన్నవి. నూతన వస్తు లాభములు, సంతానం కారణంగా సంతోషం, ధనలాభము, స్వర్ణాభరణ ప్రాప్తి, బుద్ధిబలంతో పనులు సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి.
జూలై - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శత్రుబాధలు, అనారోగ్యము, గృహమునందు సుఖము, అధికముగా ధన వ్యయము కలుగును.
ఆగస్టు - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, వృధా ప్రయాణములు, ధన వ్యయము, సంతానమువలన చికాకులు, అప్పులు చేయవలసి వస్తుంది.
సెప్టెంబర్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శత్రుబాధలు, సంతానమువలన చికాకులు, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
అక్టోబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఉన్నది. కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. పెద్దల దీవెనలు పొందితే చికాకులు తొలగును, బంధు వియోగము. శత్రువులు పెరుగును.
నవంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో సంతోషము, నూతన వస్తు, వస్త్ర, ఆభరణ లాభములు, ధన, ధాన్య వృద్ధి కలుగును.
డిసెంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గృహమునందు శుభకార్యములు జరుగును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ధనము అభివృద్ధి. అకాల భోజనము, కుటుంబమునందు శాంతి కలుగును. ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది.
జనవరి - ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. మిత్రులతో విరోధము, బంధువుల ఆరోగ్యంలో ఆందోళన, సంతానముతో విరోధము, గృహమునందు గొడవలు. మిత్రలాభము కలుగును.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అకాల భోజనము, బంధుమిత్ర విరోధములు. ఉద్యోగమందు శుభ ఫలితములు. స్థిరాస్తి లాభము, ప్రతికూల వాతావరణము కలుగును.
మార్చి - ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ ఎక్కువ. సంతానముతో విరోధము. ద్వితీయార్థమున పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి.
సంబంధిత కథనం