Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : పూర్తి చేద్దామనుకున్న పనికి.. ఏదో రకంగా ఆటంకం ఏర్పడుతుంది..
07 October 2022, 5:00 IST
- Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 7వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలితాలు
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (7-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
మేష రాశి
మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మనస్సు ఉల్లాసముగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు నియంత్రణలో పెట్టుకోండి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.
వృషభ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. తలచిన ప్రతీ పని ఏదో రకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. బంధువులు, మిత్రులతో హ్యాపీగా ఉంటారు. అనుకూలమైన వార్తలు వింటారు. శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించండి.
మిధున రాశి
ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శారీరక, మానసిక ఇబ్బందులు ఏర్పడే సూచన ఉంది. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ధనలాభము పొందుతారు. కుటుంబంలో కొంత ఇబ్బందులు వస్తాయి. ప్రయాణములలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన ఉంది. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శుభఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.
సింహ రాశి
ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చికాకులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు మధ్యస్తంగా ఉంటుంది. శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయండి.
కన్యా రాశి
ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. శత్రువులకు దూరంగా ఉండండి. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.
తులా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ధనలాభము ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు సహాయం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఉన్నా.. వాటిని పూర్తి చేస్తారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి అధికముగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించండి.
ధనూ రాశి
ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ప్రతీ పనిని చాకచక్యంతో పూర్తి చేస్తారు. సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఏర్పడే అవకాశముంది. గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మకర రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఆనందంగా ఉంటారు. ఏలినాటి శని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించండి. చేసే ప్రతి పనిని ఆచితూచీ చేయండి. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.
కుంభ రాశి
ఈరోజు మీకు చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము కుంభరాశి వారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయమిది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయండి.
మీన రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. మీరు పూర్తి చేద్దామనుకున్న పనులకు ఏదో రకంగా ఆటంకం కలుగుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
టాపిక్