Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఖర్చులు తగ్గించుకుని.. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది-today horoscope in telugu based on career and life for 6th october 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఖర్చులు తగ్గించుకుని.. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఖర్చులు తగ్గించుకుని.. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 06, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 6వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

<p>నేటి రాశిఫలితాలు</p>
నేటి రాశిఫలితాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (6-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

మేష రాశి

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పని పూర్తి చేస్తారు. సౌఖ్యము, ఆనందం కలుగుతుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు పెరిగే సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. చంద్రుని అనుకూల ప్రభావం చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభవార్తలు వింటారు. మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. భేదాభిప్రాయ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

మిధున రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. పనులలో చికాకులు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. కుటుంబముతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విశ్రాంతి దొరుకుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శత్రు బాధలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంది. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. శారీరక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పని పూర్తి చేస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. శరీర సౌఖ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము ఉంది. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. సంతానము వలన సంతోషము కలుగును. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అంతా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ పనులతో ఎదుటి వారి మన్నన పొందుతారు. ఈరోజు దత్తాత్రేయుని పూజిస్తే మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఆనందముగా గడుపుతారు. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు లాభదాయకం. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరకశ్రమ కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావం.. ఆరోగ్యం, కుటుంబ వ్యవహారములపై ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారముల్లో జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉంది. ఖర్చులు పెరుగుతాయి. అప్పులకు దూరంగా ఉండండి. ఏలినాటి శని ప్రభావం చేత కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. రాబడి తగ్గుతుంది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

Whats_app_banner

సంబంధిత కథనం