Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మీకు కలిసి వస్తుంది-today horoscope in telugu based on career and life for 5th october 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 5th October 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మీకు కలిసి వస్తుంది

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 05, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 5వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (5-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనేందుకు ప్రయత్నిస్తారు. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యము అనుకూలిస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధించడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

మిధున రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పెరుగుతుంది. పిల్లల వలన చికాకులు ఏర్పడతాయి. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో ఇబ్బందులు వస్తాయి. ప్రయాణముల వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధించండి.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కీర్తి, సౌఖ్యము పెరుగుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తగ్గుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. కొత్త వస్తువుల కోసం ధనమును ఖర్చు చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం కన్యారాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శరీర సౌఖ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. మానసికంగా ఆనందం పొందుతారు. ధనలాభం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనిని సమయానికి పూర్తి చేస్తారు. మానసిక ఆనందము పొందుతారు. ఉద్యోగములో అనుకూలత, వ్యాపారస్తులకు లాభదాయకము. ధనలాభము, కుటుంబ సౌఖ్యము పొందుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యము పొందుతారు. ధనలాభము ఉంటుంది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేస్తే మంచిది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే ఇంకా మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. డబ్బులు ఖర్చు చేస్తారు. ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే మీకు కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనడం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కుటుంబంలోని వారితో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉంది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించాల్సిన సమయమిది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును పూజించండి.

మీన రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం మీన రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్