Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శని ప్రభావంతో సమాజంలో కీర్తి.. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది-today horoscope in telugu based on career and life for 3rd october 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 3rd October 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శని ప్రభావంతో సమాజంలో కీర్తి.. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 04, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 3వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (3-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని పూర్తి చేస్తారు. గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబములో చికాకులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగమునందు మధ్యస్త ఫలితములు, వ్యాపారస్తులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారముల్లో చికాకులు ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగుతాయి. ఈరోజు దుర్గాదేవిని పూజించి.. దుర్గాష్టకము దుర్గా కవచము పఠిస్తే శుభ ఫలితములు కలుగుతాయి.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు డబ్బులు ఖర్చు చేస్తారు. ప్రయాణములు కోసం ధనము వెచ్చిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వస్తుంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్తే మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, నూతనంగా వ్యవహారాలు ప్రారంభించేప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగములో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయమిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కానీ చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రయాణములు ఎక్కువ చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాలపై శ్రద్ధ పెట్టండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు ఒత్తిడి, శత్రుత్వ భయము కలుగుతుంది. కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి, ఇబ్బందులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అప్పులు పెరుగుతాయి. మిత్రుల ద్వారా సహాయము పొందుతారు. ఈరోజు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మరింత శుభ ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శని అనుకూల ప్రభావముచేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి.. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ధనలాభము, కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితములు ఉన్నాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. కుటుంబంలో సౌఖ్యం, కీర్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఏర్పడుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన ఉంది. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అయినా సరే మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఇది కష్ట సమయము. వ్యాపారస్తులకు కూడా అంతే. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి.. చేసే ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా చేయడం మంచిది. ఈరోజు దుర్గాదేవిని పూజించి.. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠిస్తే మంచి జరుగుతుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. ధనవ్యయము, ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు కష్టకాలము. వ్యాపారస్తులకు అంతగా అనుకూలంగా ఉండదు. ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మరింత శుభ ఫలితములు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్