Telugu News  /  Rasi Phalalu  /  Horoscope Today, Telugu Rashi Phalalu, Astrological Prediction For October 3 2022
Horoscope Today
Horoscope Today (Unsplash)

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశి వారికి ఎలా ఉంది?

03 October 2022, 6:00 ISTHT Telugu Desk
03 October 2022, 6:00 IST

Horoscope Today: ఈరోజు రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ అకోబర్ 03, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము) 03.10.2022

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వయుజం

వారం: సోమవారం, తిథి: శు. అష్టమి నక్షత్రం: పూర్వాషాఢ


మేష రాశి :

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇష్టమైన వాటికోసం ధనమును ఖర్చు చేసెదరు. ఉద్యోగస్తులు ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఖర్చు అధికముగా ఉండును. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.

వృషభ రాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా లేదు. అష్టమ చంద్రుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభ రాశివారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిథున రాశి :

ఈ రోజు మీకు అంత మధ్యస్తంగా ఉంది. పనుల ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఏర్పడును. పిల్లల వలన చికాకులు ఏర్పడును. మీయొక్క కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందెదరు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిథున రాశివారు రుద్రాభిషేకము, శివారాధన చేయటం వలన ఈ రోజు మంచిది.

కర్కాటక రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ, పనులు అధికముగా ఉండును. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితము కలుగును.

సింహరాశి :

ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉన్నది. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్య రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ధనలాభము కలుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్య రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

తులా రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మానసికంగా ఉత్సాహంగా ఉండెదరు. ఉద్యోగస్తులకు శ్రమ అధికముగా ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :

ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనస్థానము నుండి చంద్రుని ప్రభావం చేత ధనలాభము, కీర్తి, కుటుంబ సౌఖ్యము కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఉద్యోగములో ఒత్తిళ్ళు వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము, బిల్వాష్టకము చదువుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

ధనూ రాశి :

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. జన్మరాశి యందు చంద్రుని ప్రభావం చేత మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, బాధలు కలుగును. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఏర్పడు సూచన. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. వ్యయస్థానము నందు చంద్రుని ప్రభావంచేత ఖర్చులు అధికమగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు శివాలయంలో శివుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శివాష్టకము, లింగాష్టకము పఠించడం వలన ఆరోగ్యస్థితి కలుగును.

కుంభ రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. చంద్రుని అనుకూల ప్రభావం చేత ఆనందముగా గడిపెదరు. ఏలినాటి శని ప్రభావము ఉన్నప్పటికి ఈ రోజు అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఏలినాటి శని ప్రభావంచేత శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు కొంత ఒత్తిళ్ళు ఏర్పడును. ఈ రోజు సుఖభోజన ప్రాప్తి, సౌఖ్యము కలుగును. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేసుకోవడం, అలాగే శివాపంచాక్షరీ మంత్రంలో జపం చేయడం వలన శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. పనుల యందు శ్రమ అధికముగా ఉండును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఆరోగ్య విషయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

టాపిక్