Virgo Horoscope | కన్యరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
కన్య రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా కన్యరాశి గురించి తెలుసుకుందాం.
Ugadi Panchangam | ఉత్తర - 2,3,4 పాదములు, హస్త - 1,2,3,4 పాదములు, చిత్త - 1,2 పాదములు
* ఆదాయం - 11
* వ్యయం - 5
* రాజ్యపూజ్యం -4
* అవమానం - 5
శ్రీ శుభకృత్ నామసంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి సప్తమ స్థానమందు సంచరించుట, శని 6వ స్థానము, వక్రియై 5వ స్థానమునందు సంచరించుట, రాహువు అష్టమస్థానమగు 8వ స్థానమునందు సంచరించుట, కేతువు 2వ స్థానమునందు సంచరించుట చేత కన్యరాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితములు ఉన్నవి. కన్యరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉన్నప్పటికి అష్టమ రాహువు ప్రభావముచేత అనారోగ్య సూచనలు, మానసిక ఒత్తిడులు అధికముగా ఉండును. ప్రయాణములు లాభించును.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ సమయంలో శని వక్రియై 5వ స్థానమందు సంచరించుట చేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితములు ఉండును. బృహస్పతి సప్తమస్థానములో సంచరించుట చేత కుటుంబమునందు అనుకూల ఫలితములు ఉండును. సప్తమ బృహస్పతి ప్రభావం చేత కన్య రాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యము, కుటుంబవిషయములు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం కన్యరాశివారికి ఉద్యోగ, వ్యాపారములలో శుభ ఫలితాలు, కుటుంబమునందు అనుకూల ఫలితములు. కన్యరాశికి అష్టమ రాహువు ప్రభావం చేత ఆరోగ్యమునకు సంబంధించిన విషయము యందు, ఒత్తిళ్లకు సంబంధించినటువంటి విషయముల యందు, లావాదేవీలకు సంబంధించిన విషయముల యందు జాగ్రత్త వహించవలెను.
కన్యరాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మధ్యస్థ నుంచి అనుకూల ఫలితములు. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య అనుకూల పరిస్థితులుగాను ఉన్నవి. కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభములు కలుగును. కన్యరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితములు ఉన్నవి. విద్యార్థులకు అనుకూల సమయం. స్త్రీలకు అనారోగ్య సూచనలు. మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు అధికముగా ఉన్నవి. కన్యరాశి వారు ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, సినీరంగం, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. కన్య రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలి అనుకుంటే.. ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం, శనివారం దుర్గాదేవిని పూజించడం, మంగళవారం విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఉత్తమం.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ - ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. రుణములు తొలిగే సూచనలు, ఖర్చులు అధికమయ్యే అవకాశం, అనారోగ్యము, ఉద్యోగము నందు, వ్యాపారంలో అభివృద్ధి శారీరక సౌఖ్యం కలుగును.
మే - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, శత్రువుల వలన గొడవలు, భయము. అనారోగ్య సూచనలు. బంధువులు, మిత్రుల వలన లాభములు.
జూన్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక అశాంతి, ఆదాయమునకు నష్టము, బంధువులు దూరమగుదురు.
జూలై - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అనారోగ్యము, సుఖసౌఖ్యములు కలుగును. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పెద్దల అభిమానమును పొందుదురు.
ఆగస్టు - ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సంసార, సంతాన సుఖములు. ధనాదాయం బాగుంటుంది. అనారోగ్యము నుంచి ఉపశమునము, అప్పుల ఒత్తిళ్లు.
సెప్టెంబర్ - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. ఖర్చులు అధికము, శత్రుబాధ, గొడవలు. బంధువుల అనారోగ్యం, అపమృత్యు దోషము.
అక్టోబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. దూరప్రయాణములు, అకాల భోజనములు, పరస్త్రీ సంగమము. ధన నష్టము కలుగును. ధనప్రాప్తి. బంధు వైరములు కలుగును.
నవంబర్ - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. తరచుగా ప్రయాణములు, వ్యాపారమునందు మందగతి. నీచులు, దుర్మార్గులతో సహవాసము.
డిసెంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధన లాభము. వ్యాపారమందు ద్రవ్య నాశనము. నూతన మార్గాలు వెదుకుతారు. ఉద్యోగ, వ్యాపారాదులలో అభివృద్ధి.
జనవరి - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. యాత్రలు చేయుట, సంఘమునందు గౌరవము కలుగును. చేపట్టిన పనులు విజయవంతమగును. బంధుమిత్రులతో సమాగమము.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు, సంతానముతో గొడవలు, ధన నష్టము, మిత్రులచే ఇబ్బందులు కలుగును. అన్ని బాధలు తగ్గు ముఖం పట్టును.
మార్చి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కుటుంబములో సుఖశాంతులు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వృధా ప్రయాణములు. లాభముగా ఉండును. పనులయందు విజయము లభించును.
సంబంధిత కథనం